Oppo Find X8 Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో ఫైండ్ X8 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
Oppo Find X8 Launch : భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రారంభ ధర రూ. 69,999కు పొందవచ్చు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్‌కు, 16జీబీ+512జీబీ మోడల్ ధర రూ. 79,999కు పొందవచ్చు.

Oppo Find X8 And Pro With Hasselblad Camera System
Oppo Find X8 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ సిరీస్ వచ్చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో మొదటి స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. ఈ లైనప్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఉన్నాయి. అలాగే, రెండు మోడల్‌లు నాలుగు 50ఎంపీ హసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరాలతో అమర్చి ఉంటాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ కంపెనీ కలర్ఓఎస్ 15 స్కిన్‌తో పాటు ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. ప్రామాణిక మోడల్‌లో 5,630mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ‘ప్రో’ మోడల్ పెద్ద 5,910mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో భారత్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రారంభ ధర రూ. 69,999కు పొందవచ్చు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్‌కు, 16జీబీ+512జీబీ మోడల్ ధర రూ. 79,999కు పొందవచ్చు. స్పేస్ బ్లాక్, స్టార్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో సింగిల్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 99,999కు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ పెరల్ వైట్, స్పేస్ బ్లాక్ కలర్‌వేస్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. ఒప్పో యూజర్లు ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రోలను డిసెంబర్ 3 నుంచి ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ దేశంలోని రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రెండూ ఆండ్రాయిడ్ 15-ఆధారిత కలర్ఓఎస్ 15పై రన్ అవుతాయి. డ్యూయల్ సిమ్ (Nano+Nano) కనెక్టివిటీకి సపోర్టు ఇస్తాయి. మునుపటిది 6.59-అంగుళాల (1,256×2,760 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. 4,500nనిట్స్ గరిష్ట ప్రకాశంతో పాటు 460పీపీఐ పిక్సెల్ సాంద్రతను కలిగి ఉంటుంది. ఒప్పో ప్రో మోడల్‌లో 6.78-అంగుళాల (1,264×2,780 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్ 450పీపీఐ పిక్సెల్ సాంద్రత, స్టాండర్డ్ మోడల్‌లో అదే రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది.
టీఎస్ఎంసీ 3ఎన్ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీపై నిర్మించిన మీడియాటెక్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ 99400 చిప్‌తో అమర్చిన భారత మార్కెట్లోమొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లు. ఈ రెండు మోడల్‌లు గరిష్టంగా 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉన్నాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సోనీ ఎల్‌టీవై-700 సెన్సార్ (ఎఫ్/1.8), 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్/2.0)తో 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో అమర్చి ఉంది. 3ఎక్స్ ఆప్టికల్‌తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా జూమ్ ఎఫ్/2.6 ఎపర్చరుతో వస్తుంది. 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో మోడల్‌లో కూడా అందుబాటులో ఉంది.
మరోవైపు, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎల్‌వైటీ-808 సెన్సార్ (ఎఫ్/1.6), 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్/2.0)తో 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (ఎఫ్/2.6), గరిష్టంగా 6ఎక్స్ ఆప్టికల్ జూమ్ (ఎఫ్/4.3)తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్858 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రెండూ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ కనెక్టివిటీకి సపోర్టును అందిస్తాయి.
యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో అమర్చబడి ఉంటాయి. అయితే, ఒప్పో ప్రో మోడల్ స్పీడ్ యూఎస్‌బీ 3.1 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు అప్లియన్సెస్ కంట్రోలింగ్ ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ (IR) ట్రాన్స్‌మిటర్‌ను కూడా కలిగి ఉంటాయి. రెండు మోడళ్లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫోన్ 5,630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అమర్చారు. 80డబ్ల్యూ (SuperVOOC), 50డబ్ల్యూ (AirVOOC) వద్ద ఛార్జ్ చేయవచ్చు. అయితే, ఫైండ్ ఎక్స్8 ప్రో అదే ఛార్జింగ్ స్పీడ్ సపోర్టు ఇచ్చే పెద్ద 5,910mAh బ్యాటరీని కలిగి ఉంది. 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్‌లో ట్రై-స్టేట్ అలర్ట్ స్లయిడర్‌ను అమర్చారు. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68/ ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది.
Read Also : iPhone Siri : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై సిరిని కాల్స్, మెసేజ్ చేయమని అడగొచ్చు..!