Oppo K13 Turbo Series : కూలింగ్ ఫ్యాన్లతో ఒప్పో K13 టర్బో సిరీస్ వచ్చేస్తోంది.. AI ఫీచర్లు మాత్రం కేక.. వచ్చేవారమే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Oppo K13 Turbo Series : వచ్చేవారమే ఒప్పో నుంచి సరికొత్త K13 టర్బో సిరీస్ వచ్చేస్తోంది. ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్నాయి..

Oppo K13 Turbo Series
Oppo K13 Turbo Series : కొత్త ఒప్పో ఫోన్ రాబోతుంది. వచ్చే వారం భారత మార్కెట్లో కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఒప్పో K13x, ఒప్పో K13 ఫోన్లు (Oppo K13 Turbo Series) రిలీజ్ కాగా, కంపెనీ ఇప్పుడు అదనంగా ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌లు కూడా లాంచ్ చేయనుంది.
ఈ ప్రో మోడల్ ఇంటర్నల్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్‌లు, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. అయితే, టర్బో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, ఏఐ ఆధారిత ఫీచర్లతో రానుంది.
ఒప్పో K13 టర్బో సిరీస్ లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో ఒప్పో K13 టర్బో సిరీస్ ఆగస్టు 11న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. కంపెనీ ఇంకా అధికారిక ధరను వెల్లడించనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్‌లు రూ. 40వేల లోపు ధరలో అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. కొత్త ఒప్పో ఫోన్ల కోసం స్పెషల్ మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఈ ఫోన్లు లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానున్నాయి.
Read Also : Jio Unlimited 5G : జియో యూజర్లకు పండగే.. జస్ట్ రూ. 51తో అన్‌లిమిటెడ్ 5G డేటా.. నెలంతా ఎంజాయ్ చేయొచ్చు..!
ఒప్పో K13 టర్బో సిరీస్ ముఖ్య ఫీచర్లు :
ఈ సిరీస్‌లోని 2 స్మార్ట్‌ఫోన్‌లు సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు. 7,000 చదరపు మిల్లీమీటర్ల స్టీమ్ రూమ్, 19వేల చదరపు మిమీ గ్రాఫైట్ లేయర్ కూడా ఉంటాయి. ఈ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC ద్వారా పవర్ పొందుతుంది. టెక్స్ట్ సమ్మరైజేషన్, స్మార్ట్ ఇండికేషన్లు, ఆన్-స్క్రీన్ వంటి జెమిని ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. Wi-Fi 7, 5G, బ్లూటూత్ 6.0 కనెక్టివిటీని కూడా కలిగి ఉండొచ్చు.
స్టాండర్డ్ టర్బో మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, రియల్ టైమ్ వాయిస్ రికగ్నిషన్, సీన్ ఆప్టిమైజేషన్, సిస్టమ్ అంతటా స్మార్ట్ ఎన్‌హాన్స్‌మెంట్‌లు వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు ఉంటాయి. ఒప్పో రెనో 14 సిరీస్‌లో భాగంగా వచ్చే నెలలో కొత్త ఒప్పో ఫోన్ కూడా లాంచ్ కానుంది. ఒప్పో నుంచి రెనో 14FS లాంచ్ చేయాలని యోచిస్తోంది.