స్మార్ట్‌ఫోన్లంటే ఇలా ఉండాలి.. ఒప్పో రెనో 14 5జీ vs ఎడ్జ్ 50 ప్రో.. రెండింట్లో ఏది కొనాలి?
మోటోరోలాను కొంటే కొన్ని కార్డులపై రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఎక్కువ రేటు కాకుండా, అతి తక్కువ రేటు కాకుండా మిడ్ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్లు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, ఒప్పో రెనో 14 5జీ మిడ్ రేంజ్‌లో గట్టిపోటీనిస్తున్నాయి. వేగవంతమైన పర్ఫార్మన్స్, మంచి కెమెరా సెటప్ ఉన్నాయి. రెండింట్లో ఏది కొనాలి? మీకు ఏది నచ్చుతుంది?
ప్రాసెసర్
మోటోరోలాలో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంది. ఇది గరిష్ఠంగా 2.63 గిగాహెర్ట్జ్ వేగంతో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ నిల్వ ఉంటుంది. ఒప్పోలో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 3.35 గిగాహెర్ట్జ్ వేగంతో పని చేస్తుంది. 8 జీబీ భౌతిక ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. మల్టీటాస్కింగ్‌కి ఒప్పో కొంచెం మెరుగ్గా పని చేస్తుంది. ప్రాసెసింగ్‌లో ఒప్పో ముందంజలో ఉంది.
డిస్‌ప్లే, బ్యాటరీ
మోటోరోలాలో 6.7 అంగుళాల ఓఎల్ఈడి డిస్‌ప్లే ఉంటుంది. హెచ్డీఆర్10 ప్లస్ సపోర్టుతో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతో ఉంది. ఒప్పోలో 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీని గ్లాస్‌కి గోరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ, మెరుగైన రంగుల ప్రొఫైల్ ఉంటుంది. కానీ రిఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్, టచ్ రెస్పాన్స్ 240 హెర్ట్జ్. మోటరోలాలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉంటుంది. ఒప్పోలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఉంది.
కెమెరా
మోటోరోలాలో మూడు కెమెరాలు ఉన్నాయి. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్, 10 ఎంపీ టెలిఫొటో ఉన్నాయి. ఇవి 4కే వీడియోను 30 ఎఫ్‌పీఎస్‌తో రికార్డు చేస్తాయి. ముందు కెమెరా 50 ఎంపీ. ఒప్పోలో రెండు 50 ఎంపీ కెమెరాలు (ప్రధాన, అల్ట్రా వైడ్), 8 ఎంపీ టెలిఫొటో ఉన్నాయి. ఇవి 4కే వీడియోను 60 ఎఫ్‌పీఎస్‌తో రికార్డు చేస్తాయి. కెమెరా పరంగా ఒప్పో ముందుంది.
ధర
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర రూ.29,990. ఒప్పో రెనో 14 ఫైవ్‌జీ ధర రూ.37,999. ధరల మధ్య తేడా రూ.8,000 తేడా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి మోటోరోలా మంచి ఆప్షన్.
బ్యాంకు ఆఫర్లు
మోటోరోలాను కొంటే కొన్ని కార్డులపై రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒప్పోపై ప్రస్తుతానికి ప్రత్యేక ఆఫర్లు లేవు.