గోషామహల్‌లో ఉప ఎన్నిక వస్తే బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేస్తారా? కుండబద్దలుకొట్టినట్లు చెప్పేసిన మాధవీలత
"నాకు ఒక్క బూత్ ఇచ్చి ఆ బూత్‌లో క్యాంపెయినింగ్ చూసుకోమంటే కూడా చూసుకుంటాను" అని మాధవీలత అన్నారు.

Madhavi Latha
బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడంతో శాసనసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ స్థానంలో బీజేపీ ఎవరిని దింపుతుందన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నాయకురాలు మాధవీలతను దింపే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.
దీనిపై మాధవీలత స్పందించారు. 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “బై ఎలక్షన్స్ ఎలా వస్తాయి? రాజాసింగ్ కూర్చున్న కొమ్మను ఇరగగొట్టుకుంటారని మీరు అనుకుంటున్నారా? స్పీకర్ కి రాజీనామా లేఖను ఇస్తారని అనుకుంటున్నారా?
ఒకవేళ కాన్‌స్టిట్యూషనల్ పవర్స్ ని దృష్టిలో పెట్టుకుని మా వాళ్లు ఏమన్నా సాధిస్తే.. లెట్స్ సీ దట్.. ఎందుకంటే మీకు ఓపెన్ చెబుతున్నాను. చిన్నతనం నుంచి నా మనస్తత్వం విభిన్నంగా ఉంది. ఎంత రెవల్యూషనిస్ట్‌నో, అంత ఒబీడియంట్ గా ఉండే ప్రయత్నం కూడా చేశాను.
Also Read: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రామచందర్‌రావు లీగల్ నోటీసులు
నా వ్యక్తిత్వమే అలా ఉంటుంది. పెద్దల ముందు చేతులు కట్టుకునే వ్యక్తిని నేను. నాకు నా పార్టీ మీద ఎందుకు ఇంత విశ్వాసముందోనని నన్ను అడగక్కర్లేదు. గతంలో కూడా నేను ఎవరినో తెలియకుండానే నాకు టికెట్ ఇచ్చారు. ఆ రోజే నన్ను చూశారు (పోటీలో నిలబెట్టారు) అంటే ఈ రోజు చూడరా?
నేను నా పార్టీకి విధేయత్వాన్ని చూపించే టైం ఇది. పార్టీలో లేనప్పుడే పార్టీ గుర్తించింది నన్ను. ఐ యామ్ రెడీ.. పార్టీ ఏ జాబ్ ఇచ్చినా చేస్తాను. పోటీలో నిలబడమంటారా నిలబడతాను.. వేరో ఎవరినో నిలబట్టి నన్ను క్యాంపెయిన్ చేయమన్నా చేస్తాను. నాకు ఒక్క బూత్ ఇచ్చి ఆ బూత్‌లో క్యాంపెయినింగ్ చూసుకోమంటే కూడా చూసుకుంటాను” అని మాధవీలత అన్నారు.