అలర్ట్: 773 మిలియన్ల ఈ-మెయిల్స్ హ్యాక్

ఏదో టార్గెట్ చేసి ఒకటో రెండూ కాదు. చాలా పెద్ద మొత్తంలో 773 మిలియన్లకు పైగా ఈ మెయిల్‌లు హ్యాకింగ్‌కు గురైయ్యాయట. ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన ట్రోయ్ హంట్.. ఈ విషయాన్ని గుర్తించాడు. 773 మిలియన్ ఈమెయిల్ ఐడీ, 21 మిలియన్ పాస్ వర్డల్ మొత్తం 87జీబీవరకూ లాగిన్ క్రెడెన్షియల్‌ల డేటా హ్యాక్ అయిందని తెలిపాడు. అంటే దాదాపు అతి పెద్ధ సెర్చ ఇంజిన్ అయిన యాహూ ఈమెయిల్ సర్వీస్‌లకు సమానం.
అయితే ఇదంతా ఒకేసారి జరిగింది మాత్రం కాదు. 2008వ సంవత్సరం నుంచి హ్యాకింగ్ గురవుతున్న ఈ మెయిల్‌ల సమాచారమట. కలెక్షన్ 1అనే పేరుతో డేటా బేస్‌లో దొరికిన ఫోల్డర్‌లో హ్యాకింగ్‌కు గురైన సమాచారమంతా కనిపించిందని ఆయన తన బ్లాగులో రాసుకొచ్చారు. మొత్తం 2,692,818,238వరుసలుగా ఆ సమాచారముందని తెలిపారు. పలు రకాలైన డేటా బ్రీచ్‌ల ద్వారా సమాచారాన్ని చోరీ చేశారని పేర్కొన్నారు. తనకు సంబంధించిన అకౌంట్ల సెక్యూరిటీ పర్యవేక్షిస్తుండగా ఇలా పాస్‌వర్డ్‌లు చోరీ అయిన విషయం తెలిసిందన్నారు. చాలా సంవత్సరాలు వాడుతున్న ఈ మెయిల్ అడ్రస్, పాస్ వర్డ్ హ్యాకింగ్‌కు గురయ్యాయనన్నారు.
మరో సెక్యూరిటీ నిపుణుడు ఈ విషయం మాట్లాడుతూ.. గత దశాబ్దంలో ఇటువంటి డేటా బ్రీచ్‌లు చాలానే జరిగాయని జాగ్రత్త వహించాలన్నాడు. ఎవరికి వారు తమకు జరగలేదని భావించవద్దని ఎప్పటికప్పుడూ తమ అకౌంట్ల పాస్ వర్డ్‌లను మార్చుకుంటూ ఉండాలని సూచించాడు. యూనిక్‌గా ఉన్న పాస్ వర్డ్‌లనే చోరీ చేసిన హ్యాకర్లు సాధారణ పాస్ వర్డ్‌లను హ్యాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదేమో.