PAN-Aadhaar : బిగ్ అలర్ట్.. మీ పాన్‌ కార్డుతో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని లింక్ చేశారా? ఈ తేదీలోగా చేయకపోతే జరిగేది ఇదే..!

PAN-Aadhaar : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫికేషన్‌లో పాన్ కార్డ్ హోల్డర్లు డిసెంబర్ 31, 2025 లోపు అసలు ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి.

PAN-Aadhaar : బిగ్ అలర్ట్.. మీ పాన్‌ కార్డుతో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని లింక్ చేశారా? ఈ తేదీలోగా చేయకపోతే జరిగేది ఇదే..!

PAN Card Holders Using Aadhaar Enrolment ID

Updated On : April 4, 2025 / 6:20 PM IST

PAN-Aadhaar : పాన్‌కార్డు హోల్డర్లకు బిగ్ అలర్ట్‌.. మీ ఆధార్ నెంబర్‌తో పాన్ కార్డు లింక్ చేశారా? లేదంటే ఇప్పుడే చేసుకోండి. ఇప్పటికే, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి అప్లయ్ చేసుకుని పాన్ కార్డ్ పొందిన వ్యక్తిగత పాన్ హోల్డర్లందరూ డిసెంబర్ 31, 2025 నాటికి అసలు ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.

Read Also : Lamborghini Temerario : లగ్జరీ లంబోర్గిని సూపర్ కారు వస్తోంది.. ఈ నెల 30నే లాంచ్.. కేవలం 2.7 సెకన్లలో 100 కి.మీ హైస్పీడ్..!

ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాన్ కార్డ్ హోల్డర్లు డిసెంబర్ 31, 2025 లోపు తమ ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలని ఆదేశించింది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. అక్టోబర్ 1, 2024కి ముందు దాఖలు చేసిన ఆధార్ దరఖాస్తు ఫారమ్ ఎన్ రోల్‌‌మెంట్ ID ఆధారంగా పర్మినెంట్ అకౌంట్ నంబర్ కేటాయించిన ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే, పాన్‌ కార్డు, ఆధార్‌ లింకింగ్ ప్రక్రియ మాదిరిగానే ఈ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని పాన్ కార్డుతో లింక్ చేయాలి. ఆధార్ నంబర్ స్థానంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని కోట్ చేసేందుకు అనుమతించే నిబంధనలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ సవరణ అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి వెళ్లి పాన్‌-ఆధార్‌ లింక్ చేసుకోవాలి. అయితే, ఈ ప్రక్రియ కోసం పాన్ హోల్డర్లు ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన పనిలేదు. మీ దగ్గరలోని పాన్‌ కార్డు సర్వీసు సెంటర్‌కు వెళ్లి లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ, సాధారణ పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డుదారులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లింక్ చేయాలంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Samsung Galaxy M16 5G : ఈ శాంసంగ్ AI స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. కేవలం రూ.630 ఈజీ EMIతో ఇంటికి తెచ్చుకోవచ్చు!

పాన్‌ కార్డు, ఆధార్‌ లింక్‌ చేసేందుకు గడువు 2023 జూన్‌ 30తోనే ముగిసింది. ఆ తర్వాత లింక్ చేసుకునే వారికి పెనాల్టీ పడుతుంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఇచ్చినవారు మాత్రమే పెనాల్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్రం విధించిన డెడ్‌లైన్‌లో లింక్ చేయకపోతే భారీ పెనాల్టీ మాత్రమే కాదు.. మీ పాన్‌ కార్డు పనిచేయకపోవచ్చు.