Pan Card 2.0 : పాన్ కార్డ్ 2.0 కావాలా? ఎవరు అర్హులు? ఏయే డాక్యుమెంట్లు అవసరం? ఆన్‌లైన్‌లో ఫ్రీగా ఎలా అప్లయ్ చేయాలి?

Pan Card 2.0 : పాన్ కార్డు 2.0 తీసుకున్నారా? ఎవరు తీసుకోవచ్చు.. ఫీచర్లు, బెనిఫిట్స్ ఏంటి? ఏయే డాక్యుమెంట్లు కావాలి? ఫ్రీగా ఎలా పొందవచ్చు..

Pan Card 2.0 : పాన్ కార్డ్ 2.0 కావాలా? ఎవరు అర్హులు? ఏయే డాక్యుమెంట్లు అవసరం? ఆన్‌లైన్‌లో ఫ్రీగా ఎలా అప్లయ్ చేయాలి?

Pan Card 2.0

Updated On : July 29, 2025 / 7:14 PM IST

Pan Card 2.0 : కొత్త పాన్ కార్డు 2.0 కోసం అప్లయ్ చేశారా? కేంద్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత పాన్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ పాన్ కార్డ్ సిస్టమ్ (Pan Card 2.0) డిజిటల్ అప్‌గ్రేడ్‌ ద్వారా ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత పాన్ కార్డుతో పోలిస్తే ఈ కొత్త వెర్షన్ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. అలాగే, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

పాన్ 2.0 అనేది డిజిటల్‌ e-PAN కార్డు. QR కోడ్‌ కలిగి ఉంటుంది. దుర్వినియోగం చేయలేరు. ఫేక్ ఐడీ క్రియేట్ చేయలేరు. మీ ఇమెయిల్‌కు e-PAN కార్డు వస్తుంది. ఇది పూర్తిగా ఉచితం. ఎలాంటి చెల్లింపు అవసరం లేదు.

కానీ, ఫిజికల్ కాపీని కావాలంటే మాత్రం తక్కువ మొత్తంలో రుసుము చెల్లించాలి. మీకు ఇప్పటికే పాన్ కార్డ్ ఉంటే.. ఆందోళన అవసరం లేదు. మీ ప్రస్తుత కార్డుకు వ్యాలిడిటీ ఉంటుంది. అప్‌గ్రేడ్ ఆప్షనల్ మాత్రమే. కొత్త పాన్ వెర్షన్‌ 2.0కి మారాలనుకుంటే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Read Also : Vivo V60 Launch : కొత్త వివో V60 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

పాన్ 2.0 అర్హులెవరు? :
ప్రస్తుతం పాన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ పాన్ 2.0కి అర్హులు. అయితే, పాన్ కార్డు కోసం కొత్తగా అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ అసలు పాన్ కార్డు లేనివారు మాత్రం ఎప్పటిలాగే సాధారణ ప్రాసెస్ ద్వారా అప్లయ్ చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ రెండూ సమర్పించాలి.

పాన్ 2.0కు అప్‌గ్రేడ్ ఎందుకు అవసరం? :
పాన్ 2.0తో ప్రాసెసింగ్ (Pan Card 2.0)  స్పీడ్ ఉంటుంది. డేటా సిస్టమ్ సేఫ్టీగా ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే డేటా ప్రాసెస్ చేయొచ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలి? :
కొత్త పోర్టల్ ద్వారా పాన్ కార్డు 2.0 అప్లయ్ చేయడం చాలా సులభం.

  •  అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
  • మీ వ్యక్తిగత వివరాలను నింపండి.
    ఆధార్, అడ్రస్ ప్రూఫ్, బర్త్‌డే సర్టిఫికేట్ వంటి స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • సబ్మిట్ (Sumbit) బటన్‌పై క్లిక్ చేయండి.

ఇ-పాన్ కార్డు కోసం అప్లయ్ చేయడం చాలా ఈజీ. NSDL ఇ-పాన్ పోర్టల్ నుంచి పొందవచ్చు. ఈ-పాన్‌ను జారీ చేసిన 30 రోజుల్లోపు ఫ్రీగా 3 సార్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.