Jio SIM Card : జియో కొత్త సిమ్ కావాలా? మీ ఇంట్లో నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!
Jio SIM Card : రిలయన్స్ జియో ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు జియో స్టోర్‌ను విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనిద్వారా ఉన్నచోటే జియో సిమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

Planning to get Jio SIM
Jio SIM Card : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో కొత్త సిమ్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం జియో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. కొత్త (iActivate) ఫీచర్. ఈ ఫీచర్ సాయంతో జియో స్టోర్‌కు వెళ్లకుండానే ఈజీగా మీ సిమ్ కార్డ్‌ని యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం మీ మొబైల్ డివైజ్ చేతిలో ఉంటే చాలు.. వినియోగదారులు తమ ఇంటినుంచే సిమ్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
Read Also : iPhone 15 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
జియో ఐయాక్టివేట్ ప్రక్రియ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ మొబైల్ ఫోన్ సిమ్ యాక్టివేషన్ ప్రాసెస్‌లో లైవ్ ఫోటో లేదా వీడియో తీయాలి. అలాగే, అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయడం వంటివి ఉంటాయి. మొత్తం ప్రక్రియ మీ ఫోన్ ద్వారానే జరుగుతంది. ఒక డివైజ్ నుంచి ప్రతిదీ సులభంగా పూర్తి చేయొచ్చు. సిమ్ యాక్టివేషన్ కోసం ప్రత్యేకించి స్టోర్ విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే మీ సిమ్‌ను ఇబ్బంది లేకుండా యాక్టివేట్ చేసుకోవచ్చు.
జియో యూజర్ల కోసం ఫ్రీ డెలివరీతో నేరుగా మీ ఇంటికి జియో సిమ్‌ను ఆర్డర్ చేసే ఆప్షన్ కూడా ఉంది. డెలివరీ ఏజెంట్ సిమ్ కార్డ్‌ని మీ ఇంటి వద్దకే తీసుకురావడమే కాకుండా యాక్టివేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తారు. దాంతో మీరే సొంతంగా యాక్టివేషన్ ప్రాసెస్‌తో మీ జియో సేవలను త్వరగా పొందవచ్చు. రిలయన్స్ జియో ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు జియో స్టోర్‌ను విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనిద్వారా ఉన్నచోటే జియో సిమ్ యాక్టివేట్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది.
మీరు ఐయాక్టివేట్ ప్రక్రియను ఉపయోగించాలని ఎంచుకున్నా లేదా యాక్టివేషన్ సాయంతో హోమ్ డెలివరీని ఎంచుకున్నా, కొత్త కస్టమర్‌లకు సాధ్యమైనంత తొందరగా జియో సర్వీసులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జియో (iActivate) ఫీచర్ మీ మొబైల్ డివైజ్ నుంచి నేరుగా కొత్త జియో సిమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కోసం మీరు లైవ్ ఫొటో లేదా వీడియోను పంపాలి. ఇతర డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాలి. ప్రత్యామ్నాయంగా, మీరు జియో సిమ్‌ని మీ ఇంటికి ఫ్రీగా డెలివరీ చేయవచ్చు. ఆ సమయంలో డెలివరీ ఏజెంట్ మీ సిమ్ యాక్టివేట్ చేస్తారు.
Read Also : Asteroid FW13 : పురాతన భారీ గ్రహశకలం గంటకు 35వేల మైళ్ల వేగంతో భూమి వైపుగా దూసుకెళ్తోంది.. నాసా హెచ్చరిక..!