Poco F7 2025 రివ్యూ… ఫోన్ అంటే మినిమం ఇలా ఉండాలి అనేలా..

Poco F7 Review: చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే, Poco F7 2025 లో బెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్ గా నిలవొచ్చు.

Poco F7 2025 రివ్యూ… ఫోన్ అంటే మినిమం ఇలా ఉండాలి అనేలా..

Poco F7

Updated On : August 1, 2025 / 4:33 PM IST

మార్కెట్లోకి ఈ ఏడాది మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లు భారీగా వచ్చాయి. రూ.40,000 లోపు ఫోన్లలో ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉంటున్నాయి. ఇటీవల పోకో తన కొత్త F7 ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని రివ్యూ చూద్దాం..

డిజైన్, డిస్‌ప్లే
Poco F7 గ్లాస్ బ్యాక్ డిజైన్, అల్యూమినియం ఫ్రేమ్, సైబర్ సిల్వర్ ఎడిషన్ లాంటి ప్రీమియం డిజైన్ తో వచ్చింది. కానీ ఫింగర్‌ప్రింట్స్ బాగా పడే సమస్య ఉంది. బాక్స్‌లో బ్లాక్ సిలికాన్ కవర్ ఉంటుంది కానీ, ఫోన్ డిజైన్ చూపించాలంటే ట్రాన్స్‌పేరెంట్ కవర్ కావాలి.

ఈ ఫోన్‌కు IP68/IP69 వాటర్-డస్ట్ ప్రొటెక్షన్ ఉంది.. అంటే నీళ్లలో పడినా, తడిచినా సమస్య ఉండదు. 215 గ్రాముల బరువుతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 6.83-ఇంచుల 120Hz AMOLED స్క్రీన్, 1.5K రెజల్యూషన్, 1700 nits బ్రైట్‌నెస్‌ ఉన్నాయి.

పెర్ఫార్మెన్స్ – సాఫ్ట్‌వేర్
ఈ ఫోన్‌లో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, ఇది ఫ్లాగ్‌షిప్ లెవెల్ పనితీరును ఇస్తుంది. కానీ, హెవీ గేమింగ్‌లో థ్రాటిల్ అవుతుంది. 16GB RAM మోడల్‌లో యాప్స్, యూజ్ అంతా స్మూత్‌గా జరిగింది. HyperOS 2 (Android 15) మీద పనిచేస్తుంది, 4 సంవత్సరాల OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. AI ఫీచర్లు ఉన్నాయి కానీ కొన్ని గిమ్మిక్స్ లా అనిపించవచ్చు.

కెమెరా
ఫోన్‌లో 50MP ప్రైమరీ + 12MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. మంచి లైటింగ్‌లో ఫోటోలు క్లియర్‌గా వస్తాయి. కానీ, లో లైట్‌లో డిటెయిల్ తక్కువగా ఉంటుంది. 20MP సెల్ఫీ కెమెరా కూడా డే లైట్లో బాగానే ఉంది. కెమెరా పరంగా చూస్తే ఇది సగటు స్థాయిలో ఉంటుంది, కెమెరాకే ప్రాధాన్యం ఇచ్చేవారికి నచ్చకపోవచ్చు.

బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,550mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉన్నా, బ్యాటరీ లైఫ్ కొంత వేరియబుల్‌గా ఉంది. మామూలుగా 1.5 రోజులు ఉంటుంది. కానీ గేమింగ్ సమయంలో 3–4 గంటల్లో బ్యాటరీ హాఫ్ అయిపోతోంది. ఇది సాఫ్ట్‌వేర్ ఇష్యూ కావచ్చు, ఫ్యూచర్ అప్‌డేట్‌తో ఫిక్స్ అవొచ్చు.

ఈ ఫోన్ ఎవరు కొనొచ్చు?
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.31,999. ఈ ఫోన్ కాజువల్ గేమర్స్, నార్మల్ యూజర్స్, ప్రీమియం లుక్, బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కావాలనుకునేవారికి బాగా సరిపోతుంది. కానీ హార్డ్‌కోర్ గేమర్స్, ఫొటోలు బాగా తీయాలని అనుకుంటున్నవారికి నచ్చదు. చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే, Poco F7 2025 లో బెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్ గా నిలవొచ్చు.