Poco M6 5G Launch : భారత్‌కు పోకో M6 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ.9,499 మాత్రమే..!
Poco M6 5G Launch : పోకో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను రూ.9,499 ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ చిప్‌సెట్, 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి.

Poco M6 5G launched in India, price starts at Rs 9,499
Poco M6 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో మరో బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. పోకో ఎట్టకేలకు భారత మార్కెట్లో పోకో ఎం5 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 6.47-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎంఐయూఐ 1తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ షూటర్‌తో వస్తుంది. పోకో కొత్తగా రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్‌లను నిశితంగా పరిశీలిద్దాం.
భారత్‌లో పోకో ఎం6 5జీ ధర, లభ్యత :
పోకో ఎమ్6 5జీ ఫోన్ డిసెంబర్ 26, 2023న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనుంది. ఈ 5జీ ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తోంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 10,499, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 12,499కు పొందవచ్చు.
Read Also : Samsung Galaxy Z Fold 5 : క్రిస్మస్ సేల్ ఆఫర్లు.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5పై ఏకంగా రూ. 9వేలు తగ్గింపు..
ఈ పోకో 5జీ బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా వినియోగదారులు ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు/ఈఎంఐ లావాదేవీలతో రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. దీనికి, సమానమైన ప్రొడక్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఎంచుకోవచ్చు. అదనంగా, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు 50జీబీ అదనపు డేటాతో ప్రత్యేక ఆఫర్‌ను పొందవచ్చు.
పోకో ఎమ్6 స్పెసిఫికేషన్స్ :
పోకో ఎమ్6 5జీ ఫోన్ 2.2జీహెచ్‌జెడ్, 2.0జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్‌తో పనిచేసే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ద్వారా అందిస్తుంది. వేగవంతమైన డేటా ప్రాసెసింగ్ అనుభవాన్ని అందిస్తుంది. విశేషమైన 428కె+ AnTuTu స్కోర్, 16జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది.

Poco M6 5G launched in India
ఎంఐయూఐ 14తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతున్న ఈ డివైజ్ రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనుంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో వస్తుంది. ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌లో కలిగి ఉంది. అన్‌లాకింగ్ కూడా ఉంది. ఈ 5జీ ఫోన్ (TœV) తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్, ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
గరిష్టంగా 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. మొత్తం యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. పోకో ఎమ్6 5జీ బ్యాక్ కెమెరా 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాను 4-ఇన్-1 సూపర్ పిక్సెల్ టెక్నాలజీతో అందిస్తుంది. తక్కువ-కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా ఏఐ పోర్ట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్ సెల్ఫీ వీడియో సామర్థ్యాలతో కూడిన 5ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. రోజంతా కనెక్టివిటీ కోసం 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో డివైజ్ 5000ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది.