Ransomware: కంపెనీలకు రాన్సమ్‌వేర్ దడ.. అడ్డుకోండి ఇలా!
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో.. టెక్నాలజీ ఉపయోగించుకొని కేటుగాళ్లు చేసే మోసాలు అంతే తారాస్థాయికి చేరుతున్నాయి. ఇందులో హ్యాకింగ్ ఇప్పుడు చిన్నా చితకా కంపెనీల నుండి బడా బడా కార్పొరేట్ సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు దడ పుట్టిస్తుంది. అందులో కూడా రాన్సమ్‌వేర్ అటాక్ చేస్తే ఇక సర్వం గల్లంతే అవుతుంది.

Ransomware
Ransomware: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో.. టెక్నాలజీ ఉపయోగించుకొని కేటుగాళ్లు చేసే మోసాలు అంతే తారాస్థాయికి చేరుతున్నాయి. ఇందులో హ్యాకింగ్ ఇప్పుడు చిన్నా చితకా కంపెనీల నుండి బడా బడా కార్పొరేట్ సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు దడ పుట్టిస్తుంది. అందులో కూడా రాన్సమ్‌వేర్ అటాక్ చేస్తే ఇక సర్వం గల్లంతే అవుతుంది. ఒక్కసారి రాన్సమ్‌వేర్ మన కంప్యూటర్ లో ఎంటర్ అయితే.. ఇక హ్యాకర్స్ అడిగినంత చెల్లించుకోవాల్సిందే. కంపెనీలోని ఒక్క కంప్యూటర్ లో ఈ రాన్సమ్‌వేర్ ప్రవేశిస్తే.. కంపెనీలోని మిగతా అన్ని కంప్యూటర్స్ కు ఎంటర్ కావడం చాల సులభం కావడంతో ఇప్పుడు రాన్సమ్‌వేర్ బారిన పడకుండా ఉండేందుకు అన్ని కంపెనీలు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే అందరికీ వైరస్ ఏంటి.. అది కంప్యూటర్ లో ఫైల్స్ ఎలా కరప్ట్ చేస్తుందనేది తెలిసే ఉంటుంది. అయితే.. మాల్ వేర్ అనేది కంప్యూటర్ లో ప్రవేశిస్తే మొత్తం కంప్యూటర్ హ్యాకర్ల చేతికి వెళ్తుంది. అలాంటి మాల్ వేర్లలో కూడా రాన్సమ్‌వేర్ అనేది అత్యంత ప్రమాదకరంగా భావించాలి. ఒకసారి ఈ రాన్సమ్‌వేర్ ఒక కంపెనీలోని ఒక కంప్యూటర్ లో చొరబడినా.. అది మిగతా అన్ని కంప్యూటర్లకు.. అక్కడ నుండి సర్వర్ల వరకు చొరబడి మొత్తం కంపెనీ వ్యవస్థను హ్యాకర్ల చేతికి వెళ్లడమే కాకుండా అన్ని కంప్యూటర్లు లాక్ అయిపోతాయి. దీంతో హ్యాకర్లు అడిగినంత చెల్లించుకొంటేనే మళ్ళీ హ్యాకర్లు వాటిని విడిపిస్తారు.
అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన ఈ రాన్సమ్‌వేర్ బారినపడకుండా రక్షణ పొందవచ్చు. అందులో ప్రధానమైనది ఆపరేటింగ్ సిస్టం జెన్యూన్ ఉండాలి. ఓఎస్‌లోని ఎన్‌టీఎల్ఎం సెక్యూరిటీ ప్రోటోకాల్ సర్వీస్ మెసేజ్ బ్లాక్ ప్రోటోకాల్ హ్యాకర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రోటోకాల్ హ్యాకర్లకు చిక్కకుండా ఉండాలంటే కంపెనీలో ఒక్క కంప్యూటర్లో కూడా పైరసీ ఓఎస్ ఉండకూడదు. ఇక, మరో ప్రధానమైనది.. స్క్రీన్ మీద కనిపించే అనుమానాస్పద లింక్‌లు, అటాచ్‌మెంట్లను ఎట్టిపరిస్థితుల్లో కూడా తెరవకూడదు.
దీంతో పాటు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ యాంటీ వైరస్ లను ఉపయోగించడంతో పాటు యూజర్ యాక్సెస్ కంట్రోల్, పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియాపై అవగాహనా కలిగివుండాలి. ఇక, చివరిగా సంస్థలోని ప్రతి ఉద్యోగికి ఈ సైబర్ ఎటాక్స్ ఎలా జరుగుతున్నాయో కనీస అవగాహనా ఉండాలి. అప్పుడు వాటిపట్ల అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక శిక్షణా తరగతులను కూడా నిర్వహించడం ఉత్తమం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ అటాక్స్ జరిగితే నష్టపోకుండా ఉండేలా డేటా బ్యాకప్ చేసుకొని ఉండాలి. సైబర్ నేరగాళ్లు అటాక్స్ జరిపి దెబ్బతీసినా బ్యాకప్ డేటాతో బయటపడొచ్చు.