India Safest Banks : దేశంలోనే అత్యంత సురక్షితమైన 3 బ్యాంకులివే.. ఆర్బీఐ కీలక ప్రకటన

India Safest Banks : ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 2014లో ఆర్‌బీఐ తొలిసారిగా దేశీయ అత్యంత సురక్షితమైన బ్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. 2015లో ఈ కీలకమైన సంస్థలను ఆర్బీఐ గుర్తించింది.

India Safest Banks : దేశంలోనే అత్యంత సురక్షితమైన 3 బ్యాంకులివే.. ఆర్బీఐ కీలక ప్రకటన

RBI Has Declared These 3 Banks As The Safest In India

Updated On : November 15, 2024 / 6:03 PM IST

India Safest Banks : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్, ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్‌లను దేశంలోని అత్యంత సురక్షితమైన బ్యాంకులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆర్బీఐ గుర్తించింది. ఈ మూడు బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులుగా (D-SIBs) గుర్తించింది. ఈ మూడు బ్యాంకులు బ్యాంకింగ్ రంగంలో కీలకమైన స్థానాలను కలిగి ఉన్నాయని ధృవీకరించింది.

నవంబర్ 13న (బుధవారం) డీ-ఎస్ఐబీఎస్ బ్యాంకుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. గత ఏడాది కూడా ఈ 3 బ్యాంకులు దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకు హోదాను పొందాయి. 2023లో డీ-ఎస్ఐబీలుగా కూడా గుర్తింపు పొందిన ఈ బ్యాంకులు.. దేశీయ ఆర్థిక వ్యవస్థకు పరిమాణం, ప్రాముఖ్యత కారణంగా మరోసారి దేశ ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలిచాయి. డీ-ఎస్ఐబీలు చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

అంతేకాకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఈ మూడు చాలా ముఖ్యమైన బ్యాంకులు. బ్యాంకుల పతనం మొత్తం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ రకమైన బ్యాంకులు చాలా ముఖ్యమైనవి. బ్యాంకులకు ఏదైనా సమస్య ఎదురైతే.. ప్రభుత్వమే వాటిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. డీ-ఎస్ఐబీల హోదా మార్చి 31, 2024 వరకు లేటెస్ట్ డేటాపై ఆధారపడి ఉంటుంది. దీనికి అనుగుణంగా, ఈ బ్యాంకులు అధిక స్థాయి మూలధనాన్ని కలిగి ఉండాలి. ప్రత్యేకంగా అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1 (CET1) మూలధనం నష్టాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరం. అదనపు సీఈటీ1 మూలధన స్థాయి డీ-ఎస్ఐబీ ఫ్రేమ్‌వర్క్‌లోని బ్యాంక్ వర్గీకరణపై ఆధారపడి ఉంటుంది.

ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 2014లో ఆర్‌బీఐ తొలిసారిగా దేశీయ అత్యంత సురక్షితమైన బ్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్బీఐ 2015లో ఈ కీలకమైన సంస్థలను గుర్తించడం ప్రారంభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలోకి చేరిన మొదటిది. ఐసీఐసీఐ బ్యాంక్ 2016లో చేరింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2017లో జాబితాలో చేరింది. డీ-ఎస్ఐబీ వర్గీకరణ అనేది ఈ సురక్షితమైన బ్యాంకుల్లో ఆర్థికపరమైన ఇబ్బందుల లేకుండా తగినంత మూలధనాన్ని కలిగి ఉండేలా రూపొందించాయి. ఈ అధిక సీఈటీ1 అవసరాలు ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థిరత్వానికి ముప్పు లేకుండా బ్యాంకులు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోనేందుకు వీలుగా రూపొందించారు.

కొత్త మూలధన అవసరాలు ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తాయి. డీ-ఎస్ఐబీ ఫ్రేమ్‌వర్క్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థలో ఈ బ్యాంకుల ప్రాముఖ్యతను సూచిస్తుంది. అదే సమయంలో, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ కూడా బకెట్ 2లోనే ఉంది. 0.40 శాతం అధిక సీఇటీ1ని నిర్వహించాలి. ఐసీఐసీ బ్యాంక్ బకెట్ 1లో ఉండగా, సీఈటీ1 బఫర్‌లో అదనంగా 0.20 శాతాన్ని నిర్వహించాలి. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తాయి.

Read Also : WhatsApp Message Drafts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మెసేజ్ డ్రాఫ్ట్‌లో కూడా పెట్టుకోవచ్చు!