Realme c11 launched : రియల్ మీ..రూ. 7 వేలకే కొత్త ఫోన్

రియల్ మీ (Realme c11) సంస్థ మరో మొబైల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 4జీ స్మార్ట్ ఫోన్. సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ కు అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందించారు.

Realme c11 launched : రియల్ మీ..రూ. 7 వేలకే కొత్త ఫోన్

Realme

Updated On : June 26, 2021 / 6:46 PM IST

Realme C11 : రోజుకో కొత్త రకమైన ఫోన్లు మార్కెట్ లోకి తెస్తున్నాయి పలు సంస్థలు. పొటాపోటీగా ఫీచర్లు తెస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి న్యూ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ ఫోన్ల రంగంలో ఉన్న రియల్ మీ (Realme c11) సంస్థ మరో మొబైల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 4జీ స్మార్ట్ ఫోన్. సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ కు అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందించారు. గత సంవత్సరం రియల్ మీ సీ11 (Realme c11) కొనసాగింపుగా..సీ11 (2021) ను విడుదల చేసింది. గతంలో ఈ ఫోన్ లో డ్యూయల్ కెమరా ఉంటే..ఈసారి మాత్రం సింగిల్ కెమెరాతో ముందుకొచ్చింది ఈ సంస్థ.

ఇక ఈ ఫోన్ వివరాలు

రియల్ మీ (Realme)రెండు రంగుల్లో లభించనుంది. దీని ధరను రూ. 6 వేల 999గా నిర్ణయించారు. సీ 11 2జీబీ / 32 జీబీ వేరియంట్ లో ఉంది.
రియల్ మీ.కామ్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు.
ఇంటర్నల్ స్టోరేజీ 256 జీబీ. 5000 maH బ్యాటరీ.

ఆండ్రాయిడ్ 11తో రియల్ మీ యూఐ 2.0తో పని చేస్తుంది.
6.5 అంగుళాల HD+ డిస్ ప్లే ఉంది.

ఆక్టాకోర్ ప్రాసెసర్ ను అమర్చారు.
వెనుక వైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపుే 5 ఎంపీ కెమెరా ఉంది.
ఓటీజీ కేబుల్ ద్వారా రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.