Realme C75 Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి C75 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
Realme C75 Launch : ఈ రియల్‌మి సి75 ఫోన్ డిసెంబర్ 1 నుంచి అమ్మకానికి వస్తుంది. ఇందులో బ్లాక్ స్టార్మ్ నైట్, లైట్నింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Realme C75 With IP69 Rating, 6,000mAh Battery Launched
Realme C75 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి రియల్‌మి సి75 వచ్చేసింది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌తో మీడియాటెక్ హెలియో జీ92 మ్యాక్స్ చిప్సెట్, దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ69-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.
45డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చారు. ఇందులో 50ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. వియత్నాంలో రియల్‌మి సి75 ధర, లభ్యత వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. పైన ఆండ్రాయిడ్ 14-ఆధారిత రియల్‌మి యూఐ 5.0 స్కిన్‌తో కూడా వస్తుంది.
రియల్‌మి C75 ధర ఎంతంటే? :
వియత్నాంలో రియల్‌మి సి75 ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ధర VND 5,690,000 (సుమారు రూ. 18,900) నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ ర్యామ్ + 512 జీబీ వెర్షన్ ధర VND 6,490,000 (దాదాపు రూ. 21,600), 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర VND 7,490,000 (దాదాపు రూ. 24,900) కూడా ఉంది.
ఈ ఫోన్ వియత్నాంలో డిసెంబర్ 1 నుంచి ది జియోయ్ డి డాంగ్ ద్వారా అమ్మకానికి వస్తుంది. ఇందులో బ్లాక్ స్టార్మ్ నైట్, లైట్నింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ లభ్యతపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
రియల్‌మి సి75 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి సి75 6.72-అంగుళాల ఫుల్-హెచ్డీ+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 690నిట్ల వరకు బ్రైట్నెస్ స్థాయిని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ హెలియో జీ92 మ్యాక్స్ ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ అదనపు 16జీబీ వరకు వర్చువల్ ర్యామ్ విస్తరణకు 24జీబీ వరకు సపోర్టు అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత రియల్‌మి UI 5.0 స్కిన్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రియల్‌మి సి75 సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ రైన్‌ల్యాండ్ డ్యూరబుల్ ఫోన్, ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్లతో పాటు 360-డిగ్రీ ఆర్మర్షెల్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో మినీ క్యాప్సూల్ 3.0 ఫీచర్ ఉంది. హోల్-పంచ్ కటౌట్ దగ్గర నోటిఫికేషన్లను చూడవచ్చు.
యూఎస్బీ టైప్-సి పోర్ట్ ద్వారా 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో రియల్‌మి లేటెస్ట్ C75 హ్యాండ్‌సెట్‌లో 6,000mAh బ్యాటరీని అందించింది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 4జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.0, ఏజీపీఎస్/జీపీఎస్, GLONASS, బీడీఎస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ సైజు 165.69 x 76.22 x 7.99ఎమ్ఎమ్, బరువు 196 గ్రాములు ఉంటుంది.