Realme GT 5 Pro Launch : రియల్‌మి జీటీ 5 ప్రో వచ్చేస్తోంది.. డిసెంబర్ 7నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!

Realme GT 5 Pro Launch : రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. డిసెంబర్ 7న లాంచ్ కానుంది. అంతకంటే ముందే కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Realme GT 5 Pro Launch : రియల్‌మి జీటీ 5 ప్రో వచ్చేస్తోంది.. డిసెంబర్ 7నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!

Realme GT 5 Pro Launch Set for December 7

Updated On : November 25, 2023 / 9:45 PM IST

Realme GT 5 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి.. వచ్చే డిసెంబర్ 7న రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ లాంచ్ కానుంది. అయితే, అంతకంటే ముందుగానే రియల్‌మి జీటీ 5 ప్రో ఫోన్ కీలక ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది. మరోవైపు.. రియల్‌మి జీటీ 5 ప్రో లాంచ్ తేదీ కూడా వెల్లడించింది.

Read Also : Royal Enfield Shotgun 650 : ఇది కదా బైక్ అంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ లాంచ్, ఫీచర్లు, ధర ఎంతంటే?

ఈ ఫోన్ రియల్‌మి జీటీ 5 లైనప్‌లో చేరుతుందని భావిస్తున్నారు. ఈ బేస్ మోడల్ ఈ ఏడాది ప్రారంభంలో ఆగస్టులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీతో లాంచ్ అయింది. మోనికర్ ప్రకారం.. రాబోయే ప్రో మోడల్ ప్రస్తుత బేస్ మోడల్ కన్నా అప్‌గ్రేడ్ చేసిన స్పెసిఫికేషన్‌లతో వస్తుందని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటివరకు రియల్‌మి జీటీ 5 ప్రో గురించి చాలా వివరాలను రివీల్ చేసింది. ఈ ఫోన్ అనేక కీలక స్పెసిఫికేషన్లను కూడా ధృవీకరించింది.

Realme GT 5 Pro Launch Set for December 7

Realme GT 5 Pro

రియల్‌మి జీటీ 5 ప్రో కెమెరా ఫీచర్లు :

వెయిబో పోస్ట్‌లో రియల్‌మి జీటీ 5 ప్రో స్థానిక కాలమానం ప్రకారం.. డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు (ఉదయం 11:30 IST) చైనాలో లాంచ్ అవుతుందని రియల్‌మి ప్రకటించింది. టీజర్‌లో షేర్ చేసిన పోస్టర్ పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను చూపుతుంది. అయితే, రాబోయే హ్యాండ్‌సెట్ లేదా డిజైన్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. రియల్‌మి జీటీ 5 ప్రో ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌తో అమర్చి ఉంటుందని, రియల్‌మి రాబోయే హ్యాండ్‌సెట్‌ను ‘టెలిఫోటో కింగ్’గా కంపెనీ పేర్కొంది.

Realme GT 5 Pro Launch Set for December 7

Realme GT 5 Pro Launch

రియల్‌మి జీటీ 5 ప్రో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ద్వారా అందిస్తుందని కంపెనీ గతంలో ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. 3వేల నిట్‌ల గరిష్ట ప్రకాశం స్థాయితో బీఓఈ ప్యానెల్‌ను అందిస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) సపోర్టుతో 50ఎంపీ 1/1.56 సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.

మునుపటి నివేదికల ప్రకారం..
రియల్‌మి జీటీ 5ప్రో 6.78-అంగుళాల (1,264 x 2,780 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. 100డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. బేస్ రియల్‌మి జీటీ 5 మోడల్ 150డబ్ల్యూ, 240డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్‌లతో వచ్చింది. మొదటిది 5,240ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. రెండోది 4,600ఎంఎహెచ్ సెల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్ ఇల్యూషన్ మిర్రర్, స్టార్రి ఒయాసిస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : TRAI DND app : స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌తో బ్లాక్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే?