Realme GT 6 Sale : రియల్‌మి జీటీ 6 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఈ 3 వేరియంట్ల ధర ఎంతంటే?

Realme GT 6 Sale : ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ స్పెషిఫికేషన్లతో వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఉంది. రియల్‌మి జీటీ 6 కూడా 6000నిట్‌ల సూపర్ బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Realme GT 6 Sale : రియల్‌మి జీటీ 6 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఈ 3 వేరియంట్ల ధర ఎంతంటే?

Realme GT 6 first sale in India today ( Image Source : Google )

Updated On : June 25, 2024 / 7:20 PM IST

Realme GT 6 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి కొత్త ఫోన్ రియల్‌మి జీటీ 6 ఫస్ట్ సేల్ మొదలైంది. రెండు రోజుల క్రితమే లాంచ్ అయిన ఈ జీటీ 6 ఫోన్ ఇప్పుడు భారత్‌లో అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ స్పెషిఫికేషన్లతో వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఉంది. రియల్‌మి జీటీ 6 కూడా 6000నిట్‌ల సూపర్ బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రైమరీ సోనీ ఎల్‌వైటీ-808 ఓఐఎస్ కెమెరాను కలిగి ఉంది.

Read Also : Gmail Gemini AI : ఇకపై జీమెయిల్‌లోనూ జెమిని ఏఐ టూల్.. ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలో తెలుసా?

నైట్ వీడియో షూటింగ్‌లో అద్భుతంగా ఉంటుంది. తక్కువ వెలుతురులో కూడా హై-క్వాలిటీ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫోన్ నెక్స్ట్ ఏఐ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ స్మార్ట్‌గా చేయడం ద్వారా యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. 120డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 10 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

రియల్‌మి జీటీ 6 ఫోన్ ధర ఎంతంటే? :
రియల్‌మి జీటీ 6 ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
8జీబీ+ 256జీబీ : రూ. 40,999 ధర, రూ. 4వేల బ్యాంక్ ఆఫర్, రూ. 1,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ తర్వాత ఆఫర్ ధర రూ. 35,999కు పొందవచ్చు.

12జీబీ + 256జీబీ : రూ. 42,999 ధర, రూ. 3వేల బ్యాంక్ ఆఫర్, రూ. వెయ్యి ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఆఫర్ ధర రూ.38,999కు పొందవచ్చు.

16జీబీ + 512జీబీ : రూ. 44,999 ధర, రూ. 4వేల బ్యాంక్ ఆఫర్, రూ. వెయ్యి ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఆఫర్ ధర రూ. 39,999కు అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ కొనుగోలుదారులు రియల్‌మి జీటీ6ని రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్ కొనుగోలుదారులు అన్ని వేరియంట్‌లలో గరిష్టంగా 12 నెలల జీరో డౌన్ పేమెంట్, 24 నెలల వరకు సులభమైన ఈఎంఐ ఆప్షన్ బెనిఫిట్స్ పొందవచ్చు. జూన్ 28 వరకు ఈ సేల్ కొనసాగుతుంది.

రియల్‌మి జీటీ 6 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి జీటీ 6 ఆండ్రాయిడ్ 14 ద్వారా ఆధారితమైనది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీని కలిగి ఉంది. గరిష్టంగా 16జీబీ ర్యామ్ కలిగి ఉంది. 3డీ టెంపర్డ్ డ్యూయల్ వీసీ కూలింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 6000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌ఎడీఆర్ 10 ప్లస్ సపోర్ట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. రియల్‌మి జీటీ 6 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో ఓఐఎస్‌తో 50ఎంపీ సోనీ సెన్సార్, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4కె రికార్డింగ్, డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 120డబ్ల్యూ అల్ట్రాడార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ ఉంది. 10 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ తెలిపింది. హై-రెస్ ఆడియో సర్టిఫైడ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

Read Also : OnePlus Nord CE4 Lite 5G : వన్‌ప్లస్ కొత్త 5జీ ఫోన్ చూశారా? కొంటే ఇలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలి.. లాంచ్ ఆఫర్లు కూడా!