Realme Narzo 60 Series : 1TB స్టోరేజీతో రియల్‌మి నార్జో 60 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?
Realme Narzo 60 Series : రియల్‌మి రాబోయే నార్జో ఫోన్‌ను 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రియల్‌మి ఇటీవలి టీజర్‌తో ఇదే విషయాన్ని రివీల్ చేసింది.

Realme Narzo 60 Series tipped to launch with 1TB storage_ Check expected price in India
Realme Narzo 60 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి నార్జో 60 సిరీస్ వచ్చేస్తోంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం.. భారత మార్కెట్లోకి (Realme Narzo 60 Series) సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. తన సోషల్ మీడియా ఛానెల్ ద్వారా రాబోయేమిడ్-రేంజ్ 5G ఫోన్‌ను రివీల్ చేసింది. రియల్‌మి నార్జో 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫోన్‌ను లాంచ్ చేయాలని రియల్‌మి ప్లాన్ చేస్తోంది. రియల్‌మి ఇటీవలి అమెజాన్‌లో టీజర్‌తో ఇదే విషయాన్ని కంపెనీ సూచించింది. రియల్‌మి నార్జో ఫోన్ భారీ స్టోరేజీ ఆప్షన్‌తో రానుందని వెల్లడించింది.
Read Also : Reliance Jio Phone 5G : అతి చౌకైన ధరకే జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ డేట్ ఎప్పుడంటే?
ఈ స్మార్ట్‌ఫోన్ హై స్టోరేజీ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తుందని సూచిస్తుంది. రియల్‌మి నార్జో 60 సిరీస్ ఫోన్ 2లక్ష 50వేల కన్నా ఎక్కువ ఫొటోలను స్టోరేజీ చేయగలదని టీజర్ చెబుతోంది. రియల్‌మి స్టాండర్డ్, ప్రో మోడల్‌ను ప్రకటించాలని భావిస్తున్నారు. కానీ, ప్రస్తుతానికి, ఏ రియల్‌మి నార్జో 60 సిరీస్ ఫోన్‌కు 1TB స్టోరేజ్ మోడల్ లభిస్తుందో తెలియదు. కంపెనీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కంపెనీ ప్రో వెర్షన్‌తో 1TB స్టోరేజ్ మోడల్‌ను అందిస్తే.. రియల్‌మి నార్జో 50 Pro ధర ధర రూ. 30వేల లోపు ఉండవచ్చు. అంటే.. దాదాపు రూ. 21,999గా ఉండవచ్చు.

Realme Narzo 60 Series tipped to launch with 1TB storage_ Check expected price in India
రియల్‌మి నార్జో 60 5G లీకైన స్పెక్స్, ఫీచర్లు ఇవే :
లీక్‌ల ప్రకారం.. రాబోయే రియల్‌మి నార్జో 60 5G ఫోన్ 6.43-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేటుతో రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది. హుడ్ కింద.. MediaTek డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌తో రావొచ్చు. Mali-G57 MC2 GPU సపోర్టు ఉంటుంది. ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. రియల్‌మి నార్జో 60 5G ఫోన్ 2MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో పాటు 64MP ప్రైమరీ కెమెరాతో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్, డివైజ్ సెల్ఫీలకు 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండవచ్చు. మీరు డివైజ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుందని ఆశించవచ్చు.
రాబోయే ఆండ్రాయిడ్ 14OS వెర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. రియల్‌మి ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 13OSతో ముందే ఇన్‌స్టాల్ అయ్యే అవకాశం ఉంది. రియల్‌మి నార్జో 60ని అత్యధిక స్టోరేజ్ ఆప్షన్‌తో అందిస్తుందని చెప్పవచ్చు. 1TB స్టోరేజ్ మోడల్‌తో వచ్చే అవకాశం ఉందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. అదనంగా, నెక్స్ట్ జనరేషన్ రియల్‌మి నార్జో ఫోన్ హుడ్ కింద సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్‌లు పేర్కొన్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్ట్‌ను కలిగి ఉందని తెలిపింది. కంపెనీ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించనుంది.
Read Also : Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ టిప్స్..!