Realme Narzo 70 Turbo 5G : రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ చూశారా? ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Realme Narzo 70 Turbo 5G : సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమెజాన్, రియల్‌మి ఇండియాలో రియల్‌మి ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.

Realme Narzo 70 Turbo 5G : రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ చూశారా? ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Realme Narzo 70 Turbo 5G Launched in India

Realme Narzo 70 Turbo 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. రియల్‌మి నుంచి లేటెస్ట్ గేమింగ్-ఫోకస్డ్ ఆఫర్‌గా రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త నార్జో సిరీస్ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

Read Also : iPhone 15 Pro Price : ఐఫోన్ 16 లాంచ్‌కు ముందు ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

ఈ మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 6.67-అంగుళాల శాంసంగ్ ఇ4 ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. జీటీ మోడ్‌ను కలిగి ఉంది. ప్రధాన గేమ్ టైటిల్‌లపై 90fps అందజేస్తుంది. 45డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ధర :
రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 16,999కు అందిస్తోంది. 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 17,999, రూ. 20,999కు అందిస్తోంది. ఈ ఫోన్ టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

రియల్‌మి ఫోన్ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమెజాన్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా ప్రారంభం కానుంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ కొనుగోలుదారులకు ప్రారంభ ధర రూ. 14,999 నుంచి రియల్‌మి ప్రత్యేక కూపన్ ద్వారా రూ. 2వేలు తగ్గింపు అందిస్తుంది.

రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (నానో) రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి యూఐ 5.0పై రన్ అవుతుంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) శాంసంగ్ ఇ4 ఓఎల్ఈడీ స్క్రీన్‌తో గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1s80Hz రేట్, 1s80Hz రేట్, గరిష్ట ప్రకాశం 2,000నిట్స్ వరకు అందిస్తుంది. రియల్‌మి డిస్‌ప్లేను ‘ఓఎల్ఈడీ ఇస్పోర్ట్స్ డిస్‌ప్లే’ అని చెప్పవచ్చు. ఇటీవలి రియల్‌మి ఫోన్‌ల మాదిరిగానే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను అందిస్తుంది.

రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ, మాలి-జీ615 జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ, 12జీబీ వరకు ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ద్వారా పవర్ పొందుతుంది. ఆన్‌బోర్డ్ ర్యామ్‌ను వర్చువల్‌గా 26జీబీ వరకు విస్తరించవచ్చు. గేమింగ్-ఫోకస్డ్ డివైజ్ హీట్ వెదజల్లడానికి 6,050ఎమ్ఎమ్ చదరపు స్టెయిన్‌లెస్ స్టీల్ స్టీమ్ కూలింగ్ అందిస్తుంది. జీటీ మోడ్ సెగ్మెంట్‌లోని మల్టీ గేమ్‌లకు 90ఎఫ్‌పీఎస్ సపోర్టు ఇస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే..
రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 50ఎంపీ ఏఐ-బ్యాక్డ్ ప్రైమరీ రియర్ కెమెరా, 2ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బెయిడూ, గెలిలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, వై-ఫై ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు యాక్సిలరేషన్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్, గైరోమీటర్, లైట్ సెన్సార్, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి.

రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 45డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 50 శాతానికి చేరుతుంది. ఈ ఐఫోన్ కొలతలు 61.7×74.7×7.6ఎమ్ఎమ్, బరువు 185 గ్రాములు ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ65 రేటింగ్‌ను పొందుతుంది.

Read Also : iPhone 16 Series : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ వచ్చేసిందోచ్.. మొత్తం 4 మోడల్స్, ధర, ఫుల్ ఫీచర్లు వివరాలివే..!