Realme P1 Pro 5G : రియల్‌మి P1 ప్రో 5జీపై స్పెషల్ డిస్కౌంట్.. కేవలం రూ.18,999 మాత్రమే.. ఈ డీల్ వారికి మాత్రమే!

Realme P1 Pro 5G Launch : బ్యాంక్‌ ఆఫర్లతో సంబంధం లేకుండా హై పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లు ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ప్రత్యేక తగ్గింపుపై అందుబాటులో ఉంది.

Realme P1 Pro 5G : రియల్‌మి P1 ప్రో 5జీపై స్పెషల్ డిస్కౌంట్.. కేవలం రూ.18,999 మాత్రమే.. ఈ డీల్ వారికి మాత్రమే!

Realme P1 Pro 5G gets special discount ( Image Credit : Google )

Updated On : June 7, 2024 / 9:17 PM IST

Realme P1 Pro 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ రియల్‌మి కొత్త P1 ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఏడాదిలో ఏప్రిల్ 15న భారతీయ మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. రియల్‌మి నుంచి రియల్‌మి పి1, రియల్‌మి పి1 ప్రో డివైజ్‌లు రూ. 20వేల లోపు సెగ్మెంట్‌లో అనేక ఫీచర్‌లను అందిస్తాయి.

Read Also : UPI Lite New Update : యూపీఐ లైట్ వాడుతున్నారా? ఇకపై మీ బ్యాంకు అకౌంట్ నుంచి వ్యాలెట్‌లోకి నేరుగా డబ్బులు పంపుకోవచ్చు!

బ్యాంక్‌ ఆఫర్లతో సంబంధం లేకుండా హై పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లు ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ప్రత్యేక తగ్గింపుపై అందుబాటులో ఉంది. మీరు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఇదే సరైన అవకాశం కావచ్చు. రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌పై ఆకట్టుకునే డీల్ అందిస్తోంది. ఈ 5జీ ఫోన్ రూ. 18,999 ప్రారంభ ధర వద్ద పొందవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ. 21,999, హై-ఎండ్ 256జీబీ వేరియంట్ ధర రూ. 22,999కు పొందవచ్చు.

ప్రత్యేక డిస్కౌంట్ పొందాలంటే? :
అయితే, ఈ స్పెషల్ సేల్ సమయంలో కొనుగోలుదారులు ప్రత్యేక తగ్గింపు నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. 8జీబీ+128జీబీ వేరియంట్‌లో కస్టమర్‌లు రూ. 2వేల ఆఫర్ ధరను రూ. 500 విలువైన కూపన్‌తో పొందవచ్చు. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర యూజర్లు రూ. 1,000 విలువైన కూపన్‌తో పాటు రూ.3వేల తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లలో రియల్‌‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి పి1 ప్రో 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని సాధిస్తుంది.

రియల్‌మి పి1 ప్రో 5జీ స్పెషిఫికేషన్లు :
ఈ డిస్‌ప్లే ఫ్లూయిడ్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మల్టీమీడియా వినియోగానికి గేమింగ్‌కు బాగా సరిపోతుంది. హుడ్ కింద ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1, 5జీ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతుంది. కెమెరా ముందు రియల్‌మి పి1 ప్రో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ ప్రాథమిక కెమెరా 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

రియల్‌మి P1 ప్రో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 45డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జర్ సపోర్టు ఇస్తుంది. ఈ బ్యాటరీ కాన్ఫిగరేషన్ గరిష్టంగా 473.58 గంటల స్టాండ్‌బై టైమ్, 35 గంటల కాలింగ్, 20 గంటల కన్నా ఎక్కువ మూవీ వ్యూ, 85 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 12 గంటల కన్నా ఎక్కువ నావిగేషన్‌ను అందిస్తుందని రియల్‌‌మి పేర్కొంది. ఛార్జర్ రిటైల్ బాక్స్‌లో అందిస్తుంది. రియల్‌మి P1 ప్రోతో పాటు రియల్‌మి P1 కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ రూ.15,999 ధరకు విక్రయానికి అందుబాటులో ఉంది.

Read Also : Jeep Meridian X special Edition : జీప్ మెరిడియన్ ‘ఎక్స్’ స్పెషల్ ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే?