Redmi 12C Launch in India : వచ్చే ఫిబ్రవరిలోనే భారత్‌లో రెడ్‌మి 12C స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు ఇవే..!
Redmi 12C Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ (Xiaomi) ఇటీవలే రెడ్‌మి నోట్ 12 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మొత్తం 3 మోడళ్లతో వేర్వేరు ధరలతో అందుబాటులోకి వచ్చాయి.

Redmi 12C tipped to launch in India next month, here is what we know
Redmi 12C Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ (Xiaomi) ఇటీవలే రెడ్‌మి నోట్ 12 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మొత్తం 3 మోడళ్లతో వేర్వేరు ధరలతో అందుబాటులోకి వచ్చాయి. అయితే, వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ సెగ్మెంట్‌లో Redmi 12C స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త Redmi 12C హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్లోకి వస్తుందని అంచనా. బార్సిలోనాలో MWC 2023 ఈవెంట్ ప్రారంభమయ్యే ముందు భారత్‌లో Redmi Note 12Cని ప్రకటించే యోచనలో Xiaomi ఉందని 91Mobiles నివేదిక పేర్కొంది. షావోమీ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. ఈ డివైజ్ చైనా మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుందని భావిస్తున్నారు. ఇదే బడ్జెట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో వేరే బ్రాండ్ పేరుతో అందుబాటులో ఉంది.
రెడ్‌మి 12C అనేది Poco C55 స్మార్ట్‌ఫోన్‌గా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని లీకర్ కాపర్ స్క్ర్జిపెక్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ Poco ఫోన్ భారత మార్కెట్లోకి కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే, భారత్‌లో రెడ్‌మి, పోకో ఫోన్‌లు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లతో వచ్చాయి. కానీ, విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

Redmi 12C tipped to launch in India next month, here is what we know
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Redmi 12C చైనీస్ మోడల్ HD+ రిజల్యూషన్‌తో 6.71-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీ ఉంది. చాలా వరకు సరసమైన ఫోన్‌లకు ఇదే ప్రమాణంగా మారింది. ఎందుకంటే సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అందించగల డివైజ్ ఎక్కువగా కోరుకుంటారు. అందుకే షావోమీ కంపెనీ 10W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను అందించింది.
Redmi 12C ఫోన్ MediaTek helio G85 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. 50-MP ప్రైమరీ కెమెరా, 0.08-MP డెప్త్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 2-MP సెన్సార్‌లు కూడా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ 5-MP కెమెరా ఉంది. రెడ్‌మి నుంచి ఎంట్రీ-లెవల్ ఫోన్ అని ఫీచర్లు చూస్తే తెలుస్తోంది.
అయితే, Redmi 12C లాంచ్‌పై అధికారిక ధృవీకరణ లేదు. వాస్తవానికి ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కావాల్సి ఉంది. రాబోయే వారాల్లో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Redmi 12C ఫోన్‌ని అదే స్పెసిఫికేషన్‌లతో లాంచ్ చేస్తుందా లేదా భారతీయ వినియోగదారుల కోసం ఇంకా మెరుగైన డీల్‌ను అందించేలా మార్పులు చేస్తుందా అనేది చూడాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Redmi K60 Series : షావోమీ రెడ్‌మి K60 సిరీస్ వచ్చేసిందోచ్.. ఇండియాలో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!