Reliance Jio Tariff Hikes : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన టారిఫ్ ధరలు.. కొత్త ప్లాన్ల వివరాలివే..!

Reliance Jio Tariff Hikes : బేస్ ఆఫర్ రూ. 155 ప్లాన్ ఇప్పుడు రూ. 189 అవుతుంది. 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంది. రూ.209 ప్లాన్ ఇప్పుడు రూ.249 అవుతుంది. అదే 28 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది.

Reliance Jio Tariff Hikes : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన టారిఫ్ ధరలు.. కొత్త ప్లాన్ల వివరాలివే..!

Reliance Jio Announces Tariff Hikes ( Image Source : Google/Reliance Jio)

Reliance Jio Tariff Hikes : లోక్ సభ ఎన్నికల అనంతరం మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలు పెరుగుతాయని మొదట్లోనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అదే జరిగింది. టెలికం దిగ్గజాల్లో అగ్రగామి అయిన రిలయన్స్ జియో తమ యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టారిఫ్ ధరలను భారీగా పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఇప్పటికే ఉన్న జనాదరణ పొందిన ప్లాన్‌లు కొంచెం ఖరీదైనవిగా ఉన్నాయి.

జూలై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి :
కొత్త ప్లాన్‌లు జూలై 3, 2024 నుంచి అమలులోకి వస్తాయి. 12.5 శాతం నుంచి అత్యధిక స్థాయిలో 25 శాతం వరకు మొబైల్ రీఛార్జ్ టారిఫ్ రేట్లు పెరగనున్నాయని కంపెనీ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొంది. తద్వారా జియో కస్టమర్లపై ప్రభావం పడనుంది. అంతేకాదు.. జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లతో పాటు 5జీ అన్‌లిమిటెడ్ ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. కొత్తగా సవరించిన రీఛార్జ్ ప్లాన్లు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

జియో బేస్ రూ. 155 ప్లాన్ తాజా పెంపుతో రూ. 189కి పెరిగింది. అంటే.. దాదాపు 22శాతం పెరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మరో టెలికం పోటీదారు అయిన భారతీ ఎయిర్‌టెల్ కన్నా ముందే ఈ పెంపును జియో ప్రకటించింది. టెల్కో 19 ప్లాన్‌లకు టారిఫ్ పెంపుదల ప్రకటించింది. ఇందులో 17 ప్రీపెయిడ్ ప్లాన్‌లు, 2 పోస్ట్‌పెయిడ్ ఆప్షన్లు ఉన్నాయి. జియో అందించే అన్ని ప్లాన్ వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

జియో టారిఫ్ ధరలు.. ఎంత పెరిగాయంటే? :
బేస్ ఆఫర్ అయిన రూ. 155 ప్లాన్ ఇప్పుడు రూ. 189 అవుతుంది. అదే 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ.209 ప్లాన్ ఇప్పుడు రూ.249 అవుతుంది. అదే 28 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌ల డేటా ప్రయోజనాలు అలాగే ఉంటాయి. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందించే రూ. 239 ప్లాన్ ఇకపై అలా ఉండదు.

రూ.239 ప్లాన్ ఇప్పుడు రూ.299 అవుతుంది. 28 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఇప్పుడు అన్‌లిమిటెడ్ 5జీ డేటా రోజుకు 2జీబీ డేటా, అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించండి. కొత్త ప్లాన్‌లు జూలై 3, 2024 నుంచి అమలులోకి వస్తాయి.

రిలయన్స్ జియోసేఫ్, జియో ట్రాన్స్‌లేట్ :
టారిఫ్ పెంపుతో పాటు జియో జియోసేఫ్, జియో ట్రాన్సులేట్ ప్రకటించింది. జియోసేఫ్ అనేది కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ మరిన్నింటికి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్ యాప్, నెలకు రూ. 199కి అందుబాటులో ఉంటుంది. జియోట్రాన్సులేట్ అనేది నెలకు రూ. 99కి వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్స్ట్, ఇమేజ్‌లను ట్రాన్సులేట్ చేయడానికి మల్టీ లాంగ్వేజీ కమ్యూనికేషన్ యాప్ అందిస్తుంది. జియో వినియోగదారులు నెలకు రూ. 298 విలువైన ఈ రెండు అప్లికేషన్‌లను ఒక ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా పొందుతారని ప్రకటించింది.

రిలయన్స్ జియో టారిఫ్ పెంపుకు ముందు ఆ తర్వాత ప్లాన్ల పూర్తి వివరాలు ఇవే.. 

Reliance Jio Announces Tariff Hikes Check New Plans and Detail

Reliance Jio Announces Tariff Hikes ( Image Source : Google/Reliance Jio)