Jio బంపర్ ఆఫర్ : JioFi ఐదు నెలలు ఉచిత డేటా

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 08:39 AM IST
Jio బంపర్ ఆఫర్ : JioFi ఐదు నెలలు ఉచిత డేటా

Updated On : August 15, 2020 / 9:47 AM IST

74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా Jio బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్, ఐదు నెలల పాటు ఉచిత డేటా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం పొందాలంటే..రూ. 1, 999 పెట్టి JioFi (జియో ఫై) కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా..జియో ప్లాన్లలో ఏదో ఒక దాంతో రీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.



తర్వాత..Jio Sim ను కూడా తీసుకోవాలి. మూడు జియోఫై ప్లాన్లలో ఏదో ఒక దానితో రీచార్జ్ చేసుకోవాలి. సిమ్ యాక్టివేట్ చేశాక తర్వాత గంట నుంచి ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ప్లాన్ స్టేటస్ ను మై జియో యాప్ లో చెక్ చేసుకోవచ్చు. జియో ఫైని ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకొనే సౌకర్యం కల్పించారు. మొత్తం మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

రూ.199 ప్లాన్ :
రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం అదనంగా రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 1000 ఉచిత నిమిషాలు అందిస్తారు. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.



రూ.249 ప్లాన్ : రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో కూడా జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం అదనంగా రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 1000 ఉచిత నిమిషాలు. రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.349 ప్లాన్ : రోజుకు 3 జీబీ డేటా లభించనుంది. జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం అదనంగా రూ.99 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 1000 ఉచిత నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు.