Jio Bharat Phone : ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ‘జియోభారత్’ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం రూ. 999 మాత్రమే.. త్వరపడండి..!
Jio Bharat Phone : ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో (JioBharat) ఫోన్‌ను రూ. 999కి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ మిలియన్ (JioBharat) ఫోన్‌ల కోసం బీటా ట్రయల్ జూలై 7న ప్రారంభం కానుంది.

Reliance Jio launches internet enabled Jio Bharat phone at Rs 999 Only
Jio Bharat Phone : ఆయిల్-టు-రిటైల్ సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో (Reliance Jio) జూలై 3న రూ. 999 ధరకు ఇంటర్నెట్-ఎనేబుల్డ్ ‘జియో భారత్’ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్-ఎనేబుల్డ్ ఫోన్ అత్యల్ప ధరతో వస్తుందని జియో పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు ఇతర ఆపరేటర్ల ఫీచర్ ఫోన్ ఆఫర్‌లతో పోలిస్తే.. 30 శాతం తక్కువ నెలవారీ ప్లాన్, 7 రెట్లు ఎక్కువ డేటాను పొందవచ్చు.
ఇతర ఆపరేటర్ల రూ.179 వాయిస్ కాల్స్, 2GB డేటాతో పోలిస్తే.. బేసిక్ రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14GB డేటా కోసం నెలకు రూ.123 ధరగా నిర్ణయించిందని జియో తెలిపింది. వార్షిక ప్లాన్‌లో రూ. 1,234 ఛార్జీ విధిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 168GB డేటా (రోజుకు 0.5 GB) ఉంటాయి. వాయిస్ కాల్స్, 24 GB డేటాతో ఇతర ఆపరేటర్ల వార్షిక ప్లాన్ రూ. 1,799తో పోలిస్తే.. 25 శాతం తక్కువ అని కంపెనీ తెలిపింది. జియో భారత్ ప్లాట్‌ఫాం ఎంట్రీ-లెవల్ ఫోన్‌లలో ఇంటర్నెట్-ఎనేబుల్డ్ సర్వీసులను అందించడానికి డివైజ్, నెట్‌వర్క్ సామర్థ్యాలను ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. రిలయన్స్ రిటైల్‌తో పాటు, కార్బన్‌తో ప్రారంభించి ఇతర ఫోన్ బ్రాండ్‌లు జియో భారత్ ఫోన్‌లను రూపొందించింది.
భారత మార్కెట్లో ఇప్పటికీ 2G-ఎనేబుల్ ఫీచర్ ఫోన్‌లను దాదాపు 250 మిలియన్ల మందికి ఇంటర్నెట్-ఎనేబుల్డ్ జియో భారత్ ఫోన్‌లను అందించడమే కంపెనీ లక్ష్యమని జియో పేర్కొంది. దేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు 2G ఎరాకు పరిమితయ్యారు. ప్రపంచం 5G విప్లవం శిఖరాగ్రంలో ఇంటర్నెట్ ప్రాథమిక ఫీచర్లను ట్యాప్ చేయలేకపోయారని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. కొత్త జియో భారత్ ఫోన్ మరో అడుగుగా పేర్కొన్నారు. రియల్ లైఫ్ వినియోగ కేసులతో విభిన్న వర్గాల యూజర్ల కోసం నిజమైన విలువను తీసుకురావడంపై దృష్టిని ప్రదర్శిస్తూనే ఉందని అంబానీ తెలిపారు.

Reliance Jio launches internet enabled Jio Bharat phone at Rs 999 Only
జియో భారత్ ఫోన్ ఫీచర్లు :
జియో భారత్ V2 ఫోన్ 1.77-అంగుళాల QVGA TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. రిమూవబుల్ 1000mAh బ్యాటరీని కూడా అందిస్తుంది. ఈ జియో ఫోన్ Jio నెట్‌వర్క్‌కు లాక్ అయి ఉంటుంది. అంటే.. వినియోగదారులు మరో ఇతర నెట్‌వర్క్ సిమ్ వాడలేరు. సిమ్ ట్రేలో (Jio SIM) మాత్రమే పనిచేస్తుంది. వినియోగదారులు టార్చ్ లైట్, FM రేడియో వంటి ఫీచర్ ఫోన్ స్టేపుల్స్ కూడా పొందుతారు. ఈ జియో ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వెనుకవైపు 0.3MP కెమెరా కూడా ఉన్నాయి. SD కార్డ్‌ల ద్వారా 128GB స్టోరేజీ వరకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ JioPay ద్వారా UPI చెల్లింపులకు సపోర్టు ఇస్తుంది.
సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (JioCinema) యాక్సెస్, మల్టీ లాంగ్వేజ్‌లలో 8 కోట్ల కన్నా ఎక్కువ పాటలను కలిగిన JioSaavn సర్వీసును కలిగి ఉంటుంది. (Jio Saavn)తో కూడిన OTT సర్వీస్ అందిస్తుంది. రిలయన్స్ రిటైల్‌తో పాటు, ఇతర ఫోన్ బ్రాండ్‌లు ‘జియో భారత్ ఫోన్‌లను’ నిర్మించడానికి ‘జియో భారత్ ప్లాట్‌ఫారమ్’ను స్వీకరించనున్నట్లు టెల్కో తెలిపింది. ఫస్ట్ ఒక మిలియన్ జియో భారత్ ఫోన్‌ల కోసం బీటా ట్రయల్ జూలై 7 నుంచి ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 6500 ప్రాంతాల్లో జరుగనుంది.