Reliance Jio : రిలయన్స్ జియో 4 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఫ్రీగా డిస్నీ+ హాట్ స్టార్ చూడొచ్చు..!
Reliance Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా డిస్నీ+ హాట్ స్టార్ యాక్సస్ చేసుకోవచ్చు.

Reliance Jio Launches 4 New Prepaid Plans With Free Disney+ Hotstar Subscription (1)
Reliance Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 4 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా డిస్నీ+ హాట్ స్టార్ యాక్సస్ చేసుకోవచ్చు. ఒక నెల కాదండోయ్.. కనీసం 3 నెలల Disney+ Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాదు.. జియో యూజర్లు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా వీక్షించవచ్చు. ప్రత్యేకించి డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పనిలేదు. రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన 4 కొత్త రీఛార్జ్ ప్లాన్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రిలయన్స్ జియో 4 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు :
రిలయన్స్ జియో అందించే 4 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో దాదాపు ఒకే విధమైన బెనిఫిట్స్ అందిస్తోంది. కానీ, వ్యాలిడిటీ మాత్రమే వ్యత్యాసం.. కొత్త రూ.333 రీఛార్జ్ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMS, 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు.
ఒకవేళ డేటా లిమిట్ దాటితే.. యూజర్లకు 64Kbps డేటా స్పీడ్ మాత్రమే వస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా కొంచెం బడ్జెట్ తక్కువ కావాలంటే.. రూ.151 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇందులో మొత్తం 8GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లు వాయిస్ కాల్స్ చేసుకోలేరు. కానీ, ఈ ప్లాన్ వ్యాలిడిటీతో రాదు. అంటే.. మీరు ఏ ప్లాన్ లో ఉంటే దాని ప్రకారమే వ్యాలిడిటీ వర్తిస్తుంది.

Reliance Jio Reliance Jio Launches 4 New Prepaid Plans With Free Disney+ Hotstar Subscription
Jio అందించే మూడవ ప్లాన్ రూ. 583తో వచ్చింది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్, రోజుకు 100 SMS, రోజుకు 1.5GB డేటా అందిస్తోంది. మీరు ఈ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత 56 రోజుల పాటు వ్యాలిడిటీ పొందవచ్చు. నాల్గో కొత్త రూ. 783 ప్రీపెయిడ్ జియో ప్యాక్ కూడా ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ పరంగా మాత్రమే తేడా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను జియో యూజర్లు పొందవచ్చునని టెలికాం ఆపరేటర్ తెలిపింది.
డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఎలా యాక్టివేట్ చేయాలి?
మీరు ముందుగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ఏదైనా జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసిన తర్వాత.. అదే Jio మొబైల్ నంబర్‌తో Disney+ Hotstar యాప్‌కి సైన్-ఇన్ చేయాలి. దీని తర్వాత.. Sign-in ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు మీ జియో నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేయాలి. ఆ తర్వాత మీరు Disney+ Hotstar యాప్‌లో కంటెంట్‌ను యాక్సస్ చేసుకోవచ్చు.
Read Also : Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!