Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 చూశారా? మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లు ఇదిగో..!
Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ ధర రూ. 1,49,900, రూ. 1,74,655 (ఎక్స్-షోరూమ్, చెన్నై) మధ్య ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Royal Enfield Hunter 350 now available in 2 more colour options
Royal Enfield Hunter 350 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోడల్ బైక్ డాపర్ ఓ (ఆరెంజ్), డాపర్ జి (గ్రీన్) అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు వేరియంట్ల ధర రూ. 1,69,656 (ఎక్స్-షోరూమ్, చెన్నై) రెండూ బుకింగ్‌లకు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు.. రాయల్ ఎన్ఫీల్డ్ అత్యంత సరసమైన మోటార్ సైకిళ్లలో ఒకటిగా హంటర్ 350 ధర రూ. 1,49,900, రూ. 1,74,655 (ఎక్స్-షోరూమ్, చెన్నై) మధ్య ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మొత్తం మూడు వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో ఫ్యాక్టరీ బ్లాక్, డాపర్, రెబెల్ ఉన్నాయి. దిగువ పేర్కొన్న ధరలలో ఇవి విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
ఫ్యాక్టరీ బ్లాక్ : రూ 1,49,900
డాపర్ ఓ : రూ. 1,69,656
డాపర్ జి : రూ. 1,69,656
డాపర్ వైట్ : రూ 1,69,656
డాపర్ గ్రే : రూ 1,69,656
రెబెల్ బ్లూ : రూ. 1,74,655
రెబెల్ రెడ్ : రూ. 1,74,655
రెబెల్ బ్లాక్ : రూ. 1,74,655
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)

Royal Enfield Hunter 350 colour options
2 లక్షల యూనిట్లు విక్రయం :
రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా హంటర్ 350 మోడల్ 2లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ మోటార్‌సైకిల్ మెట్రోలు కాకుండా టైర్-2, టైర్-3 మార్కెట్‌లలోకి వేగంగా ప్రవేశించిందని కంపెనీ పేర్కొంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 జె-సిరీస్ 349సీసీ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌ను కలిగి ఉంది. 20.2బీహెచ్‌పీ గరిష్ట శక్తిని 27ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
మోటార్‌సైకిల్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ బ్యాక్ సైడ్ ట్విన్ షాక్‌లు ఉన్నాయి. రోడ్‌స్టర్‌కు ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు (300మిమీ), వెనుక (270 మిమీ) ఒక్కో డిస్క్ ఉంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంది.
Read Also : Moto G34 5G Launch : ఈ నెల 9న భారత్‌కు మోటో G34 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?