Royal Enfield: ఏందయ్యో ఇది.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ట్రాక్టర్ టైర్లు ఎక్కించేశాడు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద వస్తున్నారంటే 90లలో మాంచి క్రేజ్. ఏదో హీరోని చూసినట్లు ఊరంతా బైక్ వెళ్లేంతసేపు చూస్తూ ఉండిపోయేవారు. ట్రెండ్ రౌండ్ వేసి మొత్తం కుర్రకారంతా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనడం మొదలుపెట్టేశారు.

Royal Enfield: ఏందయ్యో ఇది.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ట్రాక్టర్ టైర్లు ఎక్కించేశాడు

Royal Enfield

Updated On : May 11, 2021 / 7:07 PM IST

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద వస్తున్నారంటే 90లలో మాంచి క్రేజ్. ఏదో హీరోని చూసినట్లు ఊరంతా బైక్ వెళ్లేంతసేపు చూస్తూ ఉండిపోయేవారు. ట్రెండ్ రౌండ్ వేసి మొత్తం కుర్రకారంతా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనడం మొదలుపెట్టేశారు ఇప్పుడు.

ఇక పాత డిజైన్ బోర్ కొట్టిందో.. లేదంటే ఇంకా కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో కానీ, ఈ వ్యక్తి దానిని మాడిఫై చేసి ఏకంగా ట్రాక్టర్ చక్రాలు ఎక్కించేశాడు. ఏ రోడ్ల మీదైనా అలవోకగా ప్రయాణించగల రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ కు ట్రాక్టర్ చక్రాలు తగిలించడంతో ఖాళీ నేలపైకి కూడా సునాయాసంగా, ఏ భయం లేకుండా వెళ్లిపోతుంది.

దాన్ని క్రూయిజర్, బాబర్, స్క్రాంబ్లర్ లాగా మార్చేశారు. విశాలమైన టైర్లతో ఈ మోటార్ సైకిల్ ఎలా ప్రయాణిస్తుందో చూడండి మరి..

వీడియోలో చూసినట్లు ఇదిప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ కాదు అంతకుమించి. అనేక మాడిఫికేషన్స్ చేసిన ఈ బైక్ నిస్సందేహంగా కొత్త బైక్ ఏమోనని పొరబడాల్సిందే. దాంతో పాటు హెడ్ ల్యాంప్ కు బదులు ప్రొజెక్టర్ ఎల్ఈడీ యూనిట్ ను రీప్లేస్ చేసి, ఫోర్క్స్ మార్చి, హ్యాండిల్ బార్ ను కూడా మార్చేశాడు.

ఫ్యూయెల్ ట్యాంక్ ను కూడా టైర్ల మాదిరి పెద్ద సైజులో రెడీ చేశాడు. అదెలా ఉందంటే చూడటానికి హార్లీ డేవిడ్ సన్ బైక్ లా అనిపిస్తుందన్నమాట. ఇంజిన్ ఒక్కటి పాతది ఉంచి టైల్ లైట్‌తో సహా టోటల్ బాడీని మార్చేశాడు.