Samsung S21 FE : జనవరి 11న మార్కెట్లోకి శాంసంగ్ ఎస్21.. ధర ఎంతంటే..?
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని 2022 జనవరి 11న లాంఛ్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ఫోటోలను సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు.

Samsung S21 Fe
Samsung S21 FE : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని 2022 జనవరి 11న లాంఛ్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ఫోటోలను సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు. 5జీ సపోర్ట్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్21, ఎఫ్ఈ 6.41 ఇంచ్ అమోల్డ్ ఎఫ్‌హెచ్‌డీ + డిస్‌ప్లేతో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో ఆకట్టుకోనుంది.
చదవండి : Samsung Galaxy A03s : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ కొత్త బడ్జెట్ ఫోన్.. ఇండియాలో ధర ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ రెండు మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి మొదటిది 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టారేజ్ సామర్థ్యం కలిగి ఉండగా, మరొకటి 8GB RAM + 256GB స్టోరేజ్ తో రానున్నాయి. ఈ డివైజ్ వైర్‌లైస్, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇన్ స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లతో ఈ స్మార్ట్‌పోన్ కస్టమర్ల ముందుకు రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ రూ 69,900కు లభిస్తుందని అంచనాలు వెల్లడవుతున్నాయి.
చదవండి : Samsung Galaxy A13: శాంసంగ్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్