Samsung One UI 7
Samsung One UI 7 : శాంసంగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారతీయ వినియోగదారుల కోసం శాంసంగ్ కొత్త సాఫ్ట్ వేర్ అప్‌డేట్ త్వరలో వచ్చేస్తోంది. లాక్ స్క్రీన్ బగ్ వివాదాస్పదం తర్వాత దక్షిణ కొరియాలోని యూజర్ల కోసం శాంసంగ్ One UI 7 అప్‌డేట్ అధికారికంగా ప్రవేశపెట్టింది.
అయితే, యునైటెడ్ స్టేట్స్‌తో సహా కొన్ని మార్కెట్లలో శాంసంగ్ ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ ఇప్పటికీ హోల్డ్‌లో ఉందని సమాచారం. భారత్, ఇతర మార్కెట్లలో శాంసంగ్ కచ్చితమైన One UI 7 రిలీజ్ తేదీని రివీల్ చేయలేదు. కానీ, భారత్‌కు వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఫోన్ యూజర్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. మీ Galaxy S24, Galaxy S23 లేదా Galaxy Z Fold 6 మోడల్స్ భారత్‌లో వన్ UI 7 అప్‌డేట్‌ను ఎప్పుడు రిలీజ్ చేయనుంది? ఇంకా ఏయే శాంసంగ్ ఫోన్లలో ఈ అప్‌డేట్ అందుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్‌లో One UI 7 రిలీజ్, సపోర్టు చేసే ఫోన్లు ఇవే :
నివేదికల ప్రకారం.. ఆండ్రాయిడ్ 15-ఆధారిత One UI 7 అప్‌డేట్ దేశంలో గెలాక్సీ S24 సిరీస్, Z ఫోల్డ్ 6, Z ఫ్లిప్ 6లతో ప్రారంభమై అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ ఆఖరి నాటికి ఈ కొత్త అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
వచ్చే మే నెలలో గెలాక్సీ S23 సిరీస్, S22 సిరీస్, S21 సిరీస్, Z Flip5, Z Fold5, Z Flip4, Z Fold4, Tab S10, S9, S8 సిరీస్‌లు అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. అన్‌వర్స్డ్ కోసం కంపెనీ ఇప్పటికే గెలాక్సీ S23 సిరీస్ బీటా వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. త్వరలో ఈ వెర్షన్ రిలీజ్ కానుంది. అయితే, కచ్చితమైన తేదీని కంపెనీ రివీల్ చేయలేదు.
వచ్చే జూన్‌లో Samsung Galaxy A05s, A06, A14, A14 5G, A15 5G, A16 5G, A25 5G, A33 5G, A34 5G, A35 5G, A53 5G, A54 5G, A55 5G, A73 5G వంటి ఫోన్లు కొత్త అప్‌డేట్‌ను పొందుతాయి. Galaxy F05, F14, F14 5G, F15 5G, F16 5G, F34 5G, F54 5G, F55 5Gలతో పాటు Galaxy M05, M14, M14 5G, M15 5G, M16 5G, M33 5G, M34 5G, M35 5G, M53 5G, M55 5G, M55s 5Gలకు One UI 7 అప్‌డేట్ కూడా రావచ్చు.
వన్ UI 7 ఫీచర్లు :
ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7 అప్‌డేట్ కొత్త ఐకాన్స్, లేఅవుట్, కస్టమైజడ్ ఆప్షన్లతో కొత్త రిఫ్రెష్ డిజైన్‌ను అందిస్తుంది. రీడిజైన్ క్విక్ ప్యానెల్‌ను కూడా అందిస్తుంది. వినియోగదారులు నోటిఫికేషన్‌లను యాక్సెస్ చేసేందుకు టాప్ లెఫ్ట్ నుంచి కిందికి స్వైప్ చేయాలి.
గెలాక్సీ ఫోన్లను ఎంచుకోవడానికి మ్యూజిక్, మరిన్నింటిపై లైవ్ అప్‌డేట్స్ పొందవచ్చు. లాక్ స్క్రీన్‌లో ఎంతో ఆసక్తిగా ‘Now’ బార్‌ను కూడా అందిస్తోంది. ఈ అప్‌డేట్ రీడిజైన్ కెమెరా యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందిస్తుంది.