Cool Paper : ఏసీలకు గుడ్‌బై చెప్పేయండి.. మీ ఇంట్లో ఈ కూలింగ్ పేపర్ ఉంటే చాలు.. చల్లచల్లగా.. కూల్ కూల్..!
ఏసీలకు ఇక గుడ్ బై చెప్పేయండి.. మీ ఇంట్లో ఈ కూలింగ్ పేపర్ ఉంటే చాలు.. కరెంట్ కూడా అక్కర్లేదు.. మీ ఇల్లు చల్లచల్లగా.. కూల్ కూల్ అయిపోతుంది అంతే.. అదే.. ఎయిర్ కండీషర్లు అయితే.. ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది.

Say Goodbye To Air Conditioning With New Roofing Material
air conditioning with new roofing material : ఏసీలకు ఇక గుడ్ బై చెప్పేయండి.. మీ ఇంట్లో ఈ కూలింగ్ పేపర్ ఉంటే చాలు.. కరెంట్ కూడా అక్కర్లేదు.. మీ ఇల్లు చల్లచల్లగా.. కూల్ కూల్ అయిపోతుంది అంతే.. అదే.. ఎయిర్ కండీషర్లు అయితే.. ఎలక్ట్రిసిటీ అవసరం.. పైగా కరెంట్ బిల్లు కూడా గట్టిగానే వస్తుంది. ఒకవేళ కరెంట్ పోతే.. ఏసీ పనిచేయదు.. అందుకే.. ఇలాంటి సమస్య లేకుండా ఉండేలా ఓ కొత్త మెటేరియల్ కనుగొన్నాడో సైంటిస్టు.
అదే… రూఫింగ్ మెటేరియల్ (Roofing Cooling Paper Material). ఈ కూలింగ్ పేపర్ మెటేరియల్.. సూర్య కిరణాల నుంచి ఉత్పన్నమయ్యే వేడిని లాగేసుకుంటుంది. ఇంటి భవనాల్లో ఉండే ఉష్ణోగ్రత స్థాయిలను హీట్ ను గ్రహిస్తుంది. అంతే.. మీ ఇల్లంతా చల్లచల్లగా మారిపోతుంది. ఈ కూలింగ్ పేపర్.. రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు. ఇది మీ ఇంటిపై ఉన్నంతసేపు హీట్ లాగేసుకుని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది.
ఏసీలు అత్యవసరమా? :
అమెరికాలో ఏసీలు (Air Coditioners) లేని ఇళ్లు దాదాపు ఉండదనే చెప్పాలి. 87శాతం ఇళ్లల్లో ఏసీలు ఉంటాయి. ఏడాదికి ఒక్కో ఇంటికి 265 డాలర్లు ఖర్చు కూడా అవుతుంది. కొన్ని ఇళ్లల్లో మాత్రం సులభంగా రెండేసి వాడేస్తున్నారు. ఒకవైపు గ్లోబల్ టెంపరేచర్లు పెరిగిపోవడంతో ఏసీలను వదిలిపెట్టడం లేదు. చాలా మంది ఏసీలను ఇళ్లల్లో ఫిక్స్ చేయించుకుంటున్నారు. భారత్ వంటి అభివృద్ధిచెందుతున్న దేశాల్లోని మధ్య తరగతి వాళ్లు కూడా ఏసీలను ఇళ్లల్లోకి తెచ్చేసుకుంటున్నారు. 15ఏళ్ల క్రితం చైనాలో కొంతమంది మాత్రమే.. అది కూడా పట్టణ ప్రాంతాల్లోని వారి ఇంట్లోనే ఏసీలు ఉండేవి. కానీ, ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లల్లో ఏసీలు నిండిపోయాయి. ఏసీలతో వచ్చే సమస్య ఏంటంటే.. ఖరీదు ఎక్కువ.. టన్నుల కొద్ది పవర్ కావాలి. గాలి కాలుష్యంతో పాటు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమవుతాయి.
కరెంట్ కూడా అక్కర్లేదు :
ఈ కూలింగ్ పేపర్ ఇంట్లో ఉంటే.. ఏసీతో పాటు కరెంట్ కూడా అక్కర్లేదు.. నార్త్ ఈస్టరన్ యూనివర్శిటీకి చెందిన మెకానికల్, ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ అసొసియేట్ ప్రొఫెసర్ Yi Zheng ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఈ కూలింగ్ పేపర్ ఒక రోజు అమర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ కూలింగ్ పేపర్ ఇంటికి సెట్ చేసుకుంటే కరెంట్ అవసరం లేదంటున్నారు. 100శాతం రీసైకబుల్ అంటున్నారు. ఈ కూలింగ్ పేపర్.. ఏసీల కంటే గది ఉష్టోగ్రతను 10 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు తగ్గిస్తుందట..
కూలింగ్ పేపర్ తయారీ ఎలా :
న్యూస్‌ప్రింట్‌ను నానబెట్టాలి.. బ్లెండర్‌లో ముక్కలుగా చేయాలి. నీటిని తీసేయాలి.. అందులో టెఫ్లాన్ తయారుచేసే పదార్థాన్ని జోడించాలి. కూలింగ్ పేపర్ లోపల సహజ ఫైబర్స్ porous microstructure ఇంట్లో వేడిని గ్రహిస్తుంది. అలాగే జెంగ్ తన కూలింగ్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో కూలింగ్ పేపర్ ఎక్కడా కూడా కూలింగ్ కోల్పోలేదని కనుగొన్నాడు.