యూజర్లను ఆకర్షిస్తున్న మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, శాంసంగ్ గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు కూడా ఉన్నాయ్‌..

పర్ఫార్మన్స్‌, డిస్‌ప్లే అద్భుతంగా ఉండడంతో ఈ రెండు ఫోన్లు మార్కెట్లో పోటీగా నిలుస్తున్నాయి.

యూజర్లను ఆకర్షిస్తున్న మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, శాంసంగ్ గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు కూడా ఉన్నాయ్‌..

Updated On : July 4, 2025 / 3:20 PM IST

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, శాంసంగ్ గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. రూ.30,000 బడ్జెట్‌ పెట్టి ఫోన్‌ కొనాలనుకుంటున్న వారికి బెస్ట్‌ ఆప్షన్లుగా ఈ ఫోన్లు ఉన్నాయి. పర్ఫార్మన్స్‌, డిస్‌ప్లే అద్భుతంగా ఉండడంతో ఈ రెండు ఫోన్లు మార్కెట్లో పోటీగా నిలుస్తున్నాయి.

ప్రాసెసర్
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోలో Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ఉంటుంది. గరిష్ఠ వేగం 2.63 GHz. A54 5Gలో Samsung Exynos 1380 చిప్‌సెట్, గరిష్ఠ వేగం 2.4 GHz. రెండు ఫోన్లలో 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అయితే, మోటోరోలా పర్ఫార్మన్స్‌ విషయంలో కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. Samsungలో హైబ్రిడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది, ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కావాలనుకునే వారికి నచ్చుతుంది.

డిస్‌ప్లే, బ్యాటరీ
మోటోరోలాలో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే అందిస్తుంది, 1220 x 2712 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. Dolby Vision, HDR10+, Pantone సర్టిఫికేషన్ ఫీచర్లు ఉంటాయి.

Samsungలో 6.4-అంగుళాల Super AMOLED డిస్‌ప్లే, 1080p రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. బ్యాటరీ విషయంలో A54లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. కానీ కేవలం 25W వైర్డ్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. మోటోరోలా 4500mAh బ్యాటరీతో వచ్చింది. అయితే 68W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్లెస్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

Samsung vs Realme: రూ.12,000కే అద్భుతమైన ఫీచర్లతో 5G ఫోన్.. మీకు ఏ స్మార్ట్‌ఫోన్‌ బాగుంటుంది?

కెమెరా
రెండు ఫోన్లలో 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. OIS సపోర్ట్ ఉంటుంది. మోటోరోలాలో 13MP, 10MP సెకండరీ లెన్స్‌లు ఉంటాయి. Samsungలో 12MP, 5MP లెన్స్‌లు ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మోటోరోలాలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. Samsungలో 32MP కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లు 4K వీడియో 30fpsలో రికార్డ్ చేస్తాయి, కానీ మోటోరోలాలో హై రిజల్యూషన్ ఫొటోగ్రఫీ, లో-లైట్ కెప్ట్చర్ మరింత మెరుగ్గా ఉంటుంది.

ధర
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ప్రస్తుతం Amazonలో సుమారు రూ.29,990కి లభిస్తుంది. Samsung Galaxy A54 5G 256GB మోడల్ ధర రూ.28,990 నుంచి రూ.31,890 మధ్య ఉంటుంది. Cromaలో దీని ధర రూ.20,994గా ఉంది, కానీ స్టాక్ లేదు. ధర పరంగా రెండూ సమానంగా ఉన్నా, మోటోరోలా ఫీచర్ల పరంగా మెరుగ్గా ఉంటుంది.

బ్యాంక్ ఆఫర్లు
Samsungపై ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.2,000 తగ్గింపు, Flipkart Axis బ్యాంక్ కార్డ్ ద్వారా 5% క్యాష్‌బ్యాక్, Flipkart UPI ద్వారా కొత్త యూజర్లకు రూ.50 తగ్గింపు అందుబాటులో ఉంటాయి. మోటోరోలాపై పెద్దగా బ్యాంక్ ఆఫర్లు లేవు.