iPhone Air 2 Launch : కొత్త కలర్లో మెరిసిన ఐఫోన్ ఎయిర్ 2.. 48MP డ్యూయల్ కెమెరాతో రానుందా? ఫుల్ డిటెయిల్స్
iPhone Air 2 Launch : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 2 రాబోతుంది. అత్యంత సన్నని ఐఫోన్ రెండో వెర్షన్ 2027 ప్రారంభంలో లాంచ్ కానుంది. కొత్త కలర్ ఆప్షన్, 48MP డ్యూయల్ కెమెరాతో వస్తుందని లీక్ డేటా చెబుతోంది.
iPhone Air 2
- ఈ ఐఫోన్లో రెండు రియర్ కెమెరాలు ఉండొచ్చు
- ఐఫోన్ ఎయిర్ 2లో 48MP మెయిన్ కెమెరా ఉంది
- కొత్త A20 ప్రో చిప్సెట్, 2027 ప్రారంభంలో లాంచ్
iPhone Air 2 Launch : ఆపిల్ ఐఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ రాబోతుంది. ఐఫోన్ ఎయిర్ 2 ఫస్ట్ లుక్ లీక్ అయింది. రాబోయే ఈ ఐఫోన్ ఎయిర్ 2 మోడల్ ఐఫోన్ ఎయిర్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతుంది. రెండర్లలో కలర్ ఆప్షన్లతో అదిరిపోయే డిజైన్ అందించనుంది.
ఐఫోన్ బ్యాక్ సైడ్ అడ్డంగా అమర్చిన కెమెరా మాడ్యూల్ ఉండనుంది. ఈసారి, కంపెనీ 2 కెమెరాలను చేర్చవచ్చు. ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. కానీ, ఎడ్జ్‌లు మరింత సన్నగా ఉండొచ్చు. రాబోయే ఈ ఐఫోన్ గురించి లీకైన రెండర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 2 రెండర్లు లీక్ అయ్యాయి. ఐఫోన్ ఆకట్టుకునే డిజైన్, కొత్త కలర్ ఆప్షన్ కూడా సూచిస్తున్నాయి. ఈ రెండర్లను యూట్యూబర్ జాన్ ప్రోసర్ షేర్ చేశారు. ఈ రెండర్లు ఫోన్లో రెండు రియర్ కెమెరాలు ఉండవచ్చు. డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే, కొత్త ఫోన్ డిజైన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం రివీల్ చేయలేదు. ఈ ఐఫోన్లో 48MP మెయిన్ కెమెరాతో పాటు కొత్త కెమెరా కూడా ఉంటుందని అంచనా.
ఐఫోన్ 2 ఎయిర్ రెండర్లు లీక్ :
రాబోయే ఐఫోన్లో సెకండరీ కెమెరా సెన్సార్‌గా 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుందని అంచనా. ఈ ఐఫోన్ సన్నగా, 5.6mm మందంతో ఉంటుంది. టైటానియం లోహంతో రానుంది. ఇందులో కొత్త A20 ప్రో చిప్సెట్ ఉంటుందని అంచనా.
అద్భుతమైన కలర్ ఆప్షన్ కూడా ఉండనుంది. స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లతో పాటు ఈ ఐఫోన్ కొత్త లావెండర్ కలర్ ఆప్షన్లలో కూడా రావచ్చు. ఈ ఫోన్లో ఫేస్ ఐడీ ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ సైజు చిన్నదిగా ఉండొచ్చు.
రాబోయే ఐఫోన్ మోడళ్ల గురించి కీలక వివరాలు రివీల్ అయ్యాయి. రాబోయే రోజుల్లో కంపెనీ ప్రత్యేకంగా సన్నని ఐఫోన్ మోడళ్లను మెయిన్ రేంజ్ లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
దీని ప్రకారం.. ఫ్యూచర్ ఐఫోన్ మోడళ్లలో సన్నని మోడళ్లు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. కంపెనీ ప్రత్యేకంగా సన్నని ఐఫోన్ మోడల్ లాంచ్ చేయాల్సిన అవసరం ఉండదు. 2027 ప్రారంభంలో ఐఫోన్ ఎయిర్ 2 లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే ఏడాదిలోనే ఆపిల్ ఐఫోన్ 18eను కూడా లాంచ్ చేయొచ్చు.
