సోనీ వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు వచ్చేశాయ్..!!

సంగీత ప్రియులకు శుభవార్త. మ్యూజిక్ పరికరాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనీ సంస్థ నుంచి మరో కొత్త ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఎక్కడపాడైపోతాయోననే భయంతో జాగ్రత్తగా వాడుకుంటాం. ఇక నీళ్ల దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తే మరింత భద్రంగా ఉంటాం.
కానీ, సోనీ కంపెనీ నుంచి వచ్చిన వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు అందుబాటు ధరతో మార్కెట్లోకి వచ్చాయి. Sony SRS-XB12మోడల్ నెంబర్ ఉన్న ఈ లేటెస్ట్ ప్రొడక్ట్.. రూ.3,990కే దొరుకుతుంది. నీళ్లలోనూ మ్యూజిక్ వినిపించగల ప్రత్యేకతతో పాటు.. ఎక్స్ ట్రా బాస్ కూడా జోడించారు. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పాటు, ఇరు వైపుల నుంచి కనెక్ట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
ప్రయాణాల్లో చేత్తో పట్టుకున్నప్పుడు సౌకర్యంగా ఉండేందుకు దీని చుట్టూ రబ్బర్ కోటింగ్‌ను అమర్చారు. బ్యాటరీ లైఫ్ కూడా ఒక్క సారి చార్చ్ చేస్తే 16గంటల పాటు వస్తుంది. దీనిని ఎక్కడైనా వేలాడేసేందుకు అణువుగా డిజైన్ చేశారు. బ్లూ, రెడ్, బ్లాక్, గ్రే, గ్రీన్ కలర్లలో రానుంది.