బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు..!

Tech Tips in Telugu : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారుల KYC వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి చేసింది.

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు..!

Tech Tips in Telugu _ How to update your KYC online without visiting the bank

Tech Tips in Telugu : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారుల KYC వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. వ్యాలీడ్ అయ్యే డాక్యుమెంట్లు, అడ్రస్‌లో ఎలాంటి మార్పు లేని వినియోగదారులు బ్యాంక్‌ను విజిట్ చేయకుండానే తమ KYCని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు.

Tech Tips in Telugu : భారత పౌరులు ఇప్పుడు తమ KYC (Know Your Customer) వివరాలను బ్యాంక్‌కి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశ్రమ అంతటా స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి వినియోగదారులు తమ KYC వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఇప్పటికే వ్యాలీడ్ అయ్యే డాక్యుమెంట్లను సమర్పించిన అడ్రస్ మారని వినియోగదారుల కోసం RBI ఇప్పుడు ఆన్‌లైన్ KYC అప్‌డేట్స్ అందుబాటులోకి తెచ్చింది.

గత ఏడాది వరకు KYCని అప్‌డేట్ చేయడానికి ఒక శాఖను విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే, జనవరి 5, 2023 నాటి సర్క్యులర్‌లో, ఆర్బీఐ KYC సమాచారంలో ఎలాంటి మార్పులు లేకుంటే.. వినియోగదారులు వారి ఇమెయిల్ అడ్రస్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ATMలు లేదా ఇతర వాటి ద్వారా ఆటో-డిక్లరేషన్‌ను సమర్పించవచ్చని ప్రకటించింది. కేవైసీ సమాచారంలో ఎలాంటి మార్పు లేనట్లయితే.. KYC ప్రక్రియను పూర్తి చేయడానికి వ్యక్తిగత కస్టమర్ నుంచి సంబంధించిన ప్రకటన సరిపోతుందని సర్క్యులర్ పేర్కొంది.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు!

రిజిస్టర్డ్ ఇమెయిల్-ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు, డిజిటల్ ఛానెల్‌లు (ఆన్‌లైన్ బ్యాంకింగ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా వ్యక్తిగత ఖాతాదారులకు ఆటో-డిక్లరేషన్ కోసం సౌకర్యాలను అందించాలని బ్యాంకులకు సూచించింది. బ్యాంకు శాఖను విజిట్ చేయాల్సిన అవసరం లేకుండానే మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

అడ్రస్ మార్పు విషయంలో కస్టమర్‌లు ఎడిట్ చేయడం లేదా అప్‌డేట్ అడ్రస్ ఈ ఛానెల్‌లలో దేని ద్వారానైనా అందించవచ్చని సర్క్యులర్ పేర్కొంది. తదనంతరం, బ్యాంక్ కొత్తగా ప్రకటించిన అడ్రస్ రెండు నెలల వ్యవధిలో ధృవీకరిస్తుంది.

KYCని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
– మీ బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
– ‘KYC’ ట్యాబ్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి.
– స్క్రీన్‌పై సూచనలను అనుసరించండి. మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీతో సహా మీ వివరాలను అందించండి.
– ఆధార్, పాన్, అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. మీ ప్రభుత్వ ID కార్డ్‌లకు రెండు వైపులా స్కాన్ చేశారని నిర్ధారించుకోండి.
– ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయండి. తద్వారా సర్వీసు రిక్వెస్ట్ నంబర్‌ను పొందవచ్చు. బ్యాంక్ SMS లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.

కొన్ని సందర్భాల్లో మీ KYC డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయడానికి బ్యాంక్ బ్రాంచ్‌ని విజిట్ చేయాల్సి రావచ్చు. మీ KYC డాక్యుమెంట్ల గడువు ముగిసినట్లయితే లేదా వ్యాలీడ్ కానట్లయితే సాధారణంగా అవసరం పడుతుంది. మీరు బ్యాంక్ శాఖను విజిట్ చేసినప్పుడు మీరు అధికారికంగా వ్యాలీడ్ అయ్యే డాక్యుమెంట్ల (OVD) జాబితాలో పేర్కొన్న డాక్యుమెంట్లను తీసుకురావాలి.

కేవైసీ అప్‌డేట్ చేయకపోతే ఏమి చేయాలి? :
కేవైసీ (KYC) అనేది బ్యాంకులు తమ కస్టమర్‌ల ఐడెంటిటీని, అడ్రస్‌కు సంబంధించిన వివరాలను సేకరించే ప్రక్రియ. ఈ సేకరించిన సమాచారం కస్టమర్ గుర్తింపును నిర్ధారించడానికి, వారి ప్రమాద స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకుల సేవల దుర్వినియోగాన్ని నిరోధించడంలో KYC ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా బ్యాంకులకు KYC విధానం తప్పనిసరి. అందుకే ఆధార్ కార్డును క్రమానుగతంగా అప్‌డేట్ చేస్తుండాలి.

మీ KYC సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో విఫలమైతే.. లావాదేవీలపై పరిమితులు లేదా మీ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేయొచ్చు. కొన్నిసార్లు, అప్‌డేట్ చేయకపోవడం వల్ల అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అంటే.. నిర్దిష్ట ఆర్థిక లేదా ఆర్థికేతర కార్యకలాపాల కోసం మీ అకౌంట్ ఉపయోగించలేరు. అయితే, ఈ తీవ్రమైన చర్య తీసుకునే ముందు.. మీ అకౌంట్ సస్పెండ్ చేయడానికి ముందు మీ KYC అప్‌డేట్ కాకపోతే బ్యాంక్ మీకు తెలియజేస్తుంది.

RBI నుంచి KYC అప్‌డేట్ FAQ ప్రకారం.. నియంత్రిత సంస్థతో ఇప్పటికే అకౌంట్ ఉన్న కస్టమర్ వారి శాశ్వత ఖాతా సంఖ్య (PAN) లేదా సమానమైన ఇ-డాక్యుమెంట్ లేదా ఫారమ్ నం.60ని అందించకూడదని నిర్ణయించుకుంటే.. నియంత్రిత సంస్థ అకౌంట్ మూసివేయండి. తగిన గుర్తింపు డాక్యుమెంట్లను పొందడం ద్వారా కస్టమర్ గుర్తింపు వెరిఫై చేసిన తర్వాత అకౌంట్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

Read Also : Tech Tips in Telugu : కంప్యూటర్‌లో పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నారా? ఈ కొత్త ఏఐ టూల్ మీ పాస్‌వర్డ్‌ను ఇలా పసిగట్టేస్తుంది జాగ్రత్త..!