Tecno Pova 6 Pro 5G : భారీ బ్యాటరీతో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Tecno Pova 6 Pro 5G : టెక్నో పోవా 6 ప్రో 5జీ భారత్ మార్కెట్లో ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కామెట్ గ్రీన్, మెటోరైట్ గ్రే అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Tecno Pova 6 Pro 5G : భారీ బ్యాటరీతో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Tecno launches Pova 6 Pro 5G with Arc Lighting, 6,000mAh battery in India

Tecno Pova 6 Pro 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? కొత్త టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ 5జీ ఫోన్‌ను మొదటగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లో కంపెనీ ప్రవేశపెట్టింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ వంటి ఫీచర్లు, 108ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

అదనంగా, ఫోన్ 70డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. టెక్నో మొబైల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపత్రా ప్రకారం.. పోవా 6 ప్రో 5జీ ఫోన్ ప్రత్యేకమైన ఫీచర్లలో డిజైన్, 200 కన్నా ఎక్కువ ఎల్ఈడీతో బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది. పవర్‌ఫుల్ బ్యాటరీ, ఛార్జర్‌తో పోవా 6 ప్రో మార్కెట్లో అందుబాటులో ఉంది.

Read Also : iPad Air Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐప్యాడ్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.9,901 మాత్రమే!

టెక్నో పోవా 6 ప్రో 5జీ ధర ఎంతంటే? :
టెక్నో పోవా 6 ప్రో 5జీ, 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ. 19,999, 12జీబీ + 256జీబీ ఆప్షన్ కోసం రూ. 21,999 ఆకర్షణీయమైన ధరలతో ప్రవేశించింది. సేల్ వ్యవధిలో ఆసక్తిగల కొనుగోలుదారులు అన్ని బ్యాంకుల్లో రూ. 2వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆఫర్‌లతో 8జీబీ వేరియంట్‌ ధర రూ.17,999, 12జీబీ వేరియంట్‌ ధర రూ.19,999కి తగ్గుతుంది.

అదనంగా, టెక్నో కొనుగోలుదారులకు రూ. 4,999 విలువైన టెక్నో ఎస్2 స్పీకర్‌ను కూడా అందిస్తోంది. లభ్యత విషయానికొస్తే.. టెక్నో పోవా 6 ప్రో 5జీ భారత్ మార్కెట్లో ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కామెట్ గ్రీన్, మెటోరైట్ గ్రే అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

టెక్నో పోవా 6 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ :
టెక్నో పోవా 6ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్‌లతో ఆకట్టుకునే గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ, 12జీబీ వరకు ర్యామ్ కలిపి వర్చువల్‌గా 12జీబీ వరకు విస్తరించవచ్చు. ముఖ్యంగా, 8జీబీ ర్యామ్ వేరియంట్‌ను అదనంగా 8జీబీతో విస్తరించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైఓఎస్ 14పై రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే.. టెక్నో పోవా 6 ప్రో 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, 3ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్, 2ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్, ఏఐ-మెరుగైన లెన్స్ ఉన్నాయి. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కలిగి ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం డ్యూయల్-టోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.

డైనమిక్ పోర్ట్ 2.0 ఫీచర్, డిస్‌ప్లేలోని హోల్ పంచ్ కటౌట్ చుట్టూ నోటిఫికేషన్‌లు, ఇతర హెచ్చరికలను తెలివిగా ప్రదర్శిస్తుంది. ఈ డివైజ్ అప్‌డేట్ చేసిన ఆర్క్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ప్రవేశపెట్టింది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ చుట్టూ 200 కన్నా ఎక్కువ ఎల్ఈడీలను కలిగి ఉంది. 100 కన్నా ఎక్కువ కస్టమైజడ్ అందిస్తోంది. ఫోన్ డాల్బీ అట్మోస్-సపోర్టెడ్ డ్యూయల్ స్పీకర్లతో వస్తుంది. టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ 6,000ఎంఎహెచ్ బ్యాటరీ, 70డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి ఉన్నాయి. 7.8ఎమ్ఎమ్ మందం, 195గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!