Tecno Pova Slim
Tecno Pova Slim : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారికి అద్భుతమైన ఫోన్. టెక్నో లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. టెక్నో పోవా స్లిమ్ భారత మార్కెట్లో అధికారికంగా (Tecno Pova Slim) లాంచ్ అయింది. ఈ బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ రిలీజ్ చేసింది.
ప్రీమియం, తేలికైన డిజైన్, స్పెషల్ బ్యాక్ కెమెరా లేఅవుట్‌తో అమోల్డ్ డిస్ ప్లే, లోకల్ లాంగ్వేజీ సపోర్టుతో ఏఐ ఆధారిత ఫీచర్లు, ధర తగినట్టుగా ఆకట్టుకునే స్పెషిఫికేషన్లతో వస్తుంది. టెక్నో పోవా స్లిమ్ ధర, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు, లభ్యతకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టెక్నో పోవా స్లిమ్ స్పెసిఫికేషన్లు :
టెక్నో పోవా స్లిమ్ 5G ఫోన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. 4500 నిట్స్ గరిష్ట ప్రకాశం, 92.6శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కూడా కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, మాలి-G57 GPUతో వస్తుంది. 8GB వరకు LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. యాప్‌లు, ఫైల్‌లకు అవసరమైన స్టోరేజీని అందిస్తుంది.
ఈ టెక్నో పోవా ఫోన్ 5160mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ వైపు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HiOS 15ని రన్ అవుతుంది. ప్రాంతీయ భాషా సపోర్టు, ఏఐ రైటింగ్ టూల్స్, ప్రైవసీ బ్లర్రింగ్, ఏఐ ఇమేజ్ అప్ గ్రేడ్స్ అందించే ఎల్లా ఏఐతో వస్తుంది. అదనపు ప్రైవసీ కోసం పోవా స్లిమ్ సున్నా నెట్‌వర్క్ కమ్యూనికేషన్ కలిగి ఉంటుందని టెక్నో పేర్కొంది.
టెక్నో పోవా స్లిమ్ కెమెరా సెటప్ :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. టెక్నో పోవా స్లిమ్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ లెన్స్, ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కెమెరా యాప్‌లో పోర్ట్రెయిట్, సూపర్ నైట్, వ్లాగ్ మోడ్, స్లో మోషన్, పనోరమా, మాక్రో మోడ్ వంటి మల్టీ మోడ్‌లు ఉన్నాయి.
టెక్నో పోవా స్లిమ్ ధర :
టెక్నో పోవా స్లిమ్ 5G ఫోన్ స్కై బ్లూ, స్లిమ్ వైట్, కూల్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సెప్టెంబర్ 8 నుంచి ఈ టెక్నో పోవా సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ టెక్నో ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ పార్టనర్లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ధర రూ. 19,999కు అందుబాటులో ఉంటుంది.