New British Motorcycle : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. భారత్‌కు కొత్త బ్రిటీష్ బుల్లెట్ ‘బీఎస్ఏ గోల్డ్‌స్టార్’ బైక్ వస్తోంది..

New British Motorcycle : బీఎస్ఏ (BSA) గోల్డ్‌స్టార్ అనేది ఒక ఐకానిక్ నేమ్‌ట్యాగ్. దీనికి వారసత్వం, చరిత్ర ఆధునిక అవతార్‌లో గోల్డ్‌స్టార్ రెట్రోగా కనిపిస్తుంది. మోడ్రాన్ లుక్‌తో సింగిల్ రౌండ్ హెడ్‌ల్యాంప్ ఫ్రంట్ ఎండ్‌లో ఉంటుంది.

New British Motorcycle : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. భారత్‌కు కొత్త బ్రిటీష్ బుల్లెట్ ‘బీఎస్ఏ గోల్డ్‌స్టార్’ బైక్ వస్తోంది..

new British motorcycle manufacturer ( Image Source : Google )

Updated On : June 25, 2024 / 8:16 PM IST

New British Motorcycle : బుల్లెట్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో బ్రిటీష్ బుల్లెట్ బైక్ భారత్‌కు రాబోతోంది. ప్రముఖ జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్ల తయారీదారులైన క్లాసిక్ లెజెండ్స్ బీఎస్ఏ మోటార్‌సైకిళ్ల పేరుతో భారత మార్కెట్లో మూడో బ్రాండ్‌ను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. భారత్‌లో రెట్రో మోటార్‌సైకిల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్లాసిక్ లెజెండ్స్, దేశంలోని జావా, యెజ్డీ తయారీదారులు ఇప్పుడు పూర్తి స్థాయిలో విస్తరించాలని భావిస్తున్నారు.

Read Also : OnePlus Nord CE4 Lite 5G : వన్‌ప్లస్ కొత్త 5జీ ఫోన్ చూశారా? కొంటే ఇలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలి.. లాంచ్ ఆఫర్లు కూడా!

ఈ క్రమంలోనే 650సీసీ మోటార్‌సైకిల్ ఇంజిన్‌గా కనిపించే టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆ బైక్ ఫొటోను పరిశీలిస్తే.. మోటారు అంతర్జాతీయ మార్కెట్‌లలో కంపెనీ విక్రయిస్తున్న బీఎస్ఏ గోల్డ్‌స్టార్‌కు చెందినదిగా కనిపిస్తోంది. అంటే.. భారత్‌లో కంపెనీ బీఎస్ఏ మోడల్ లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. టీజర్ ప్రకారం.. క్లాసిక్ లెజెండ్స్ భారత్‌లో బీఎస్ఏ బ్రాండ్‌ను ఆగస్టు 15, 2024న లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ బీఎస్ఏ గోల్డ్‌స్టార్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బీఎస్ఏ గోల్డ్‌స్టార్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
బీఎస్ఏ (BSA) గోల్డ్‌స్టార్ అనేది ఒక ఐకానిక్ నేమ్‌ట్యాగ్. దీనికి వారసత్వం, చరిత్ర ఆధునిక అవతార్‌లో గోల్డ్‌స్టార్ రెట్రోగా కనిపిస్తుంది. మోడ్రాన్ లుక్‌తో సింగిల్ రౌండ్ హెడ్‌ల్యాంప్ ఫ్రంట్ ఎండ్‌లో ఉంటుంది. బైక్ పైభాగంలో ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ కూడా పాత ఎన్‌ఫీల్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. రౌండ్ బీఎస్ఏ లోగోను కలిగి ఉంది. ఈ బైకు కెపాసిటీ 12 లీటర్లు. సీటు సింగిల్-పీస్ యూనిట్, వెనుకవైపు రెట్రో టెయిల్ ల్యాంప్, ఫెండర్ కాంబోతో డిజైన్ కలిగి ఉంటుంది.

బీఎస్ఏ గోల్డ్‌స్టార్.. ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ :
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. అదేవిధంగా, బీఎస్ఏ గోల్డ్‌స్టార్ 652సీసీ, లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ మోటార్‌తో వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పవర్ అవుట్‌పుట్ 45bhp వద్ద ఉంది. ఈ బైక్ టార్క్ 55Nm వద్ద రేట్ అవుతుంది. అయితే, భారతీయ వెర్షన్ వచ్చేసరికి ఈ గణాంకాలు మారవచ్చు.

Read Also : Realme GT 6 Sale : రియల్‌మి జీటీ 6 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఈ 3 వేరియంట్ల ధర ఎంతంటే?