Best Smartphones : రూ. 25వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మోటో, వివో ఫోన్లు మాత్రం హైలెట్..!

Best Smartphones : కొత్త ఫోన్ కోసం చూసేవారికి ఇదే బెస్ట్ టైమ్.. రూ. 25వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

Best Smartphones

Best Smartphones : కొత్త పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో అతి తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆకర్షణీయమైన డిజైన్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కలిగిన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. గేమర్ లేదా విద్యార్థి అయినా ఈ స్మార్ట్‌ఫోన్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.

Read Also : Aadhaar Update : 10ఏళ్లుగా మీ ఆధార్ అప్‌డేట్ చేయలేదా? ఈ నెల 10వరకు ఫ్రీ.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

2025లో మీరు రూ. 25వేల లోపు ధరలో ఐక్యూ Z10 నుంచి నథింగ్ ఫోన్ 3a వరకు అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలు చేయొచ్చు.

ఐక్యూ జెడ్ 10 :
ఐక్యూ Z10 ఫోన్ మోడల్ ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్, 8GB ర్యామ్‌తో గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ అందిస్తుంది.

విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ స్క్రీన్‌ ఉంది. రింగ్ LEDతో కూడిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంది.

సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 7300mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ కలిగి ఉంది. విద్యార్థులకు, హై-ఎండ్ యూజర్లకు సరైన ఫోన్. ఇందులో అల్ట్రావైడ్ లెన్స్ లేదు. నైట్ టైమ్ ఫొటోగ్రఫీకి అంతగా బాగుండదని చెప్పవచ్చు. ఈ ఐక్యూ ఫోన్ ధర రూ. 22వేలు ఉంటుంది.

వివో T4 :
వివో T4 ఫోన్ Z10 హార్డ్‌వేర్‌తో ఈక్వల్. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB స్టోరేజీని అందిస్తుంది. స్క్రీన్ స్పెషిఫికేషన్లు కూడా ఒకేలా ఉంటాయి.

120Hz డిస్‌ప్లే 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

కంటెంట్ క్రియేటర్లు, సెల్ఫీ ప్రియులకు బెస్ట్ ఫోన్. ఫ్లాష్ ఛార్జింగ్‌తో భారీ 7300mAh బ్యాటరీని అందిస్తుంది. అల్ట్రావైడ్ కెమెరా, NFC సపోర్టు లేకపోవడం మైనస్. పర్ఫార్మెన్స్, బ్యాటరీ స్లిమ్ డిజైన్‌ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ వివో T4 ధర రూ. 21,999 వద్ద లభ్యమవుతుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్, 8GB ర్యామ్ ఉన్నాయి. 6.7-అంగుళాల FHD+ P-OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కెమెరాలో 50MP + 13MP బ్యాక్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ఏఐ ఫీచర్లు, టర్బో పవర్-ఎనేబుల్ 5000mAh బ్యాటరీ రోజంతా ఛార్జ్‌ అందిస్తుంది. తక్కువ కాంతిలో ఫోటోలు పెద్దగా ఆకర్షణీయంగా ఉండవు. ఈ మోటోరోలా ఫోన్ రూ. 22,980 ధరకు అందుబాటులో ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, 8GB ర్యామ్ కలిగి ఉంది. 6.67-అంగుళాల P-OLED FHD+ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ స్పీకర్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

50MP + 13MP కాంబో, 32MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. 256GB ఇంటర్నల్ స్టోరేజీతో 5500mAh బ్యాటరీ కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం వస్తుంది. ఇందులో NFC సపోర్టు లేదు. ఈ మోటోరోలా ఫోన్ రూ. 22,495 ధరకు కొనుగోలు చేయొచ్చు.

నథింగ్ ఫోన్ 3a :
నథింగ్ ఫోన్ 3a మోడల్ 8GB ర్యామ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ FHD+ డిస్‌ప్లేతో సపోర్ట్ చేస్తుంది.

Read Also : BigBasket : స్విగ్గీ, జొమాటోకు పోటీగా బిగ్‌బాస్కెట్.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. ఫుల్ డిటెయిల్స్..!

కెమెరా హైలైట్ కాగా, బ్యాక్ సైడ్ 50MP+8MP+50MP సెటప్, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ (OS) క్లీన్‌గా ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 5000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇన్-బాక్స్ ఛార్జర్ లేదు. ఈ ఫోన్ రూ. 24,999 ధరకే లభిస్తోంది.