శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? 5 బెస్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు అదరహో..

ఈ సంవత్సరం మంచి ఫీచర్లతో విడుదలైన శాంసంగ్‌ ఫోన్ల వివరాలు మీకోసం..

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? 5 బెస్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు అదరహో..

Updated On : May 29, 2025 / 1:40 PM IST

మీ బడ్జెట్‌కు తగ్గ ఒక కొత్త శాంసంగ్‌ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మిడ్ రేంజ్‌లో కొన్ని శాంసంగ్‌ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి ఫీచర్లతో విడుదలైన శాంసంగ్‌ ఫోన్ల వివరాలు మీకోసం..

1. Samsung Galaxy S24 FE

అద్భుత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది. దీనిలో 6.7-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Samsung Exynos 2400e ప్రాసెసర్, 8GB RAMతో ఇది వచ్చింది. 50MP + 12MP + 8MP బ్యాక్ కెమెరాలు, 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4700mAh బ్యాటరీ, వేగవంతమైన చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

2. Samsung Galaxy A35 5G

అన్ని విధాలా చాలా మంది నచ్చుతున్న ఫోన్ ఇది. దీనిలో Exynos 1380 ప్రాసెసర్, 8GB RAM ఉంటాయి. 6.6 అంగుళాల FHD+ Super AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ దీని ప్రత్యేకత. 50MP + 8MP + 5MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.

3. Samsung Galaxy M35 5G

తక్కువ బడ్జెట్‌లో చక్కటి పనితీరు కోరుకునేవారికి ఇది సరైనది. దీనిలో Exynos 1380 ప్రాసెసర్, 6GB RAM అమర్చారు. 6.6 అంగుళాల FHD+ Super AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ దీని సొంతం. 50MP + 8MP + 2MP కెమెరా సెటప్, 13MP సెల్ఫీ కెమెరా దీనిలో ఉన్నాయి. 6000mAh భారీ బ్యాటరీ ఉంది.

Also Read: కేక పెట్టించే కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. రూ.25 వేలలోపే వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

4. Samsung Galaxy M56 5G

ఈ స్మార్ట్‌ఫోన్‌ Exynos 1480 ప్రాసెసర్, 8GB RAMతో వచ్చింది. 6.7 అంగుళాల Super AMOLED Plus డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఆకట్టుకుంటాయి. 50MP + 8MP + 2MP కెమెరాలు, 12MP ముందు కెమెరా దీనిలో ఉంది. 5000mAh బ్యాటరీ ఉంది.

5. Samsung Galaxy S25

ఇది ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే ఫోన్. Snapdragon 8 Elite ప్రాసెసర్, 12GB RAMతో వచ్చింది. 6.2 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా, 4000mAh బ్యాటరీ దీనిలో ఉంటాయి. ప్రీమియం మిడ్రేంజ్ విభాగంలో ఇది ఒక మంచి ఫోన్.