TRAI DND app : స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌తో బ్లాక్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే?

TRAI DND app : మీ ఫోన్‌కు స్పామ్ కాల్స్ అదేపనిగా వస్తున్నాయా? ఇలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌తో చెక్ పెట్టొచ్చు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

TRAI DND app : స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌తో బ్లాక్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే?

TRAI DND app to help users block unwanted callers

TRAI DND app : స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్, అనవసరమైన మెసేజ్‌లకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త యాప్ ప్రవేశపెట్టింది. భారత్‌లో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే ట్రయ్.. వినియోగదారులను బాధించే ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను నివారించేందుకు ‘డోంట్ డిస్టర్బ్’ (DND) అనే కొత్త యాప్‌ను డెవలప్ చేసింది. అయితే, ఈ యాప్‌లో కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా వినియోగదారులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి.

ట్రాయ్ కార్యదర్శి వి. రఘునందన్ ట్రూకాలర్ ఈవెంట్‌లో ఈ సమస్యలపై ప్రస్తావించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందం పనిచేస్తున్నారని చెప్పారు. డీఎన్‌డీ యాప్ ముఖ్య ఉద్దేశ్యం మొబైల్ వినియోగదారులకు అవాంఛిత కాల్‌లు లేదా సందేశాలపై రిపోర్టు చేయడం లేదా బ్లాక్ చేయాలి. యాప్ పనితీరును మెరుగుపరచడానికి ఈ బగ్‌లను పరిష్కరించడంపై ట్రాయ్ దృష్టి సారించిందని రఘునందన్ హామీ ఇచ్చారు.

Read Also : 2023 Royal Enfield Himalayan : రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త హిమాలయన్ అడ్వెంచర్ బైక్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

ఈ సాంకేతిక సవాళ్లను పరిష్కరించడం ద్వారా డీఎన్‌డీ యాప్ సజావుగా పనిచేసేలా చూడాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వలన వినియోగదారులు ఇబ్బందికరమైన కమ్యూనికేషన్‌లను సులభంగా రిపోర్టు చేయొచ్చు. భారత్‌లోని మొబైల్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే కాకుండా అద్భుతమైన అనుభవాన్ని మెరుగుపరచడానికి ట్రాయ్ ప్రయత్నిస్తోంది. ఈ సాంకేతిక సమస్యల పరిష్కారాన్ని అనుసరించి వినియోగదారులు మరింత విశ్వసనీయమైన సమర్థవంతమైన డీఎన్‌డీ యాప్‌ను రూపొందించారు.

డీఎన్‌డీ యాప్‌లో సాంకేతిక సమస్యలు :

ట్రాయ్ డూనాట్ డిస్టర్బ్ యాప్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై రఘునందన్ చర్చించారు. ఈ సమస్యలను అంగీకరిస్తూ.. యాప్‌లో గుర్తించిన బగ్‌లను పరిష్కరించడానికి ట్రాయ్ ఒక ఎక్స్‌ట్రనల్ ఏజెన్సీని నియమించినట్టు ఆయన తెలిపారు. పర్యవసానంగా, నిర్దిష్ట ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కించగా మార్చి 2024 నాటికి అన్ని డివైజ్‌ల్లో యాప్ విశ్వవ్యాప్తంగా పనిచేసేలా ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఐఫోన్లలో డీఎన్‌డీ యాప్ సపోర్టు చేయదు :
అయితే, కాల్ లాగ్‌లను యాక్సెస్ చేయడంపై ఆపిల్ పరిమితుల కారణంగా డీఎన్‌డీ యాప్ ప్రస్తుతం ఐఫోన్లలో సపోర్టు చేయడం లేదు. అందుకే ఈ యాప్‌ని ఐఓఎస్ డివైజ్‌లకు సపోర్టు చేసేలా మార్చడానికి ట్రాయ్ ప్రయత్నిస్తోంది. ట్రూకాలర్ యాప్ భారత్‌లో 270 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్‌లను కలిగి ఉందని సంస్థ సీఈఓ అయిన అలాన్ మామెడి తెలిపారు.

TRAI DND app to help users block unwanted callers

TRAI DND app 

ప్రతిరోజూ 5 మిలియన్ స్పామ్ కాల్‌లను సమిష్టిగా రిపోర్టు చేసినట్టు వెల్లడించారు. ట్రాయ్ డీఎన్‌డీ యాప్ మరిన్ని మార్పులతో భవిష్యత్తులో స్పామ్ కాల్‌లలో మరింత తగ్గుతుందని వివిధ డివైజ్‌ల్లోని వినియోగదారులకు మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడానికి సాయపడుతుందని భావిస్తున్నారు.

ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌ని ఎలా ఉపయోగించాలి? :
– గూగుల్ ప్లే స్టోర్‌లో ‘TRAI DND 3.0‘ యాప్‌ని సెర్చ్ చేయండి.
* ‘ఇన్‌స్టాల్’పై క్లిక్ చేసి, యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
* మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి.
* ఇన్‌స్టాల్ చేసిన ట్రాయ్ డీఎన్‌డీ 3.0 యాప్‌ని ఓపెన్ చేయండి.
* ఓటీటీప (వన్-టైమ్ పాస్‌వర్డ్) వెరిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా సైన్ ఇన్ చేయండి.
* సైన్ ఇన్ చేసిన తర్వాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్‌లను బ్లాక్ చేయడం ద్వారా మీ నంబర్ డోంట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) జాబితాకు చేరుతుంది.
* మీరు ఇప్పటికీ ఇబ్బందికరమైన కాల్స్ లేదా టెక్స్ట్‌లను స్వీకరిస్తే.. వెంటనే మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయండి లేదా ఫైల్ చేసేందుకు యాప్‌ని ఉపయోగించండి.

Read Also : Royal Enfield Shotgun 650 : ఇది కదా బైక్ అంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ లాంచ్, ఫీచర్లు, ధర ఎంతంటే?