AI Agents Phone Call : వామ్మో.. ఇదెక్కడి చోద్యం.. ఏఐ ఏజెంట్స్ గిలిబిలి భాష.. మనషుల భాష మాకొద్దు.. తెగ మాట్లాడేసుకున్నాయి!
AI Agents Call : ఏఐ ఎంతగా అడ్వాన్స్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక ఫోన్ కాల్ చేసిన ఏఐ బాట్‌తో మరో ఏఐ బాట్ రియాక్ట్ అయింది. రెండు ఏఐ బాట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడి ఆ తర్వాత మిషన్ లాంగ్వేజీలో సీక్రెట్‌గా మాట్లాడుకున్నాయి.

AI Agents Call
AI Agents Call : వామ్మో.. ఏఐతో జర జాగ్రత్త.. ఏఐ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఏది రియల్ అనేది చెప్పడం కష్టమే. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అందరికిన షాకింగ్ గురిచేస్తోంది. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం.. యూకేలో ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఏఐ బాట్ రెస్పాండ్ అయింది.
అనుకోకుండా మరో ఏఐ బాట్ ఆ కాల్‌కు స్పందించింది. రెండు ఏఐ ఏజెంట్స్ తెగ మాట్లాడేసుకున్నాయి. ముందుగా మనుషుల భాష ఇంగ్లీష్‌లో మాట్లాడటం మొదలుపెట్టి.. ఆ తర్వాత ఏకంగా మిషన్ లాంగ్వేజీలో మాట్లాడుకున్నాయి. వాస్తవానికి ఈ మిషన్ లాంగ్వేజీని గిబ్బర్ లింక్ మోడ్ అని పిలుస్తారు.
మనుషులకు అర్థంకానీ రీతిలో విచిత్రమైన బీఫ్ సౌండ్ చేస్తూ ముచ్చటించుకున్నాయి. గిబ్బర్ లింక్ అంటే.. ఒక ఏఐ మరో ఏఐ బాట్ తో మాట్లాడుకోవడం అనమాట. ఇదో రకమైన ప్రోటోకాల్.. బోరిస్, స్టార్ కోవ్, అంటోన్ పిడ్‌కుయ్‌కో అనే ముగ్గురు క్రియేట్ చేశారు. ఏఐ ఏజెంట్ల మధ్య సంభాషణకు సంబంధించి వీడియోపై నెటిజన్లు షాక్ అవుతున్నారు.
THIS IS SCARY…
2 AI agents talk to each other in their own language to book a hotel for someone. As much as this scares me I can’t help but be fascinated by it. Wow 😳😳😳 pic.twitter.com/QdgPDdVvXG
— Adrian (@squawk_hawk) February 26, 2025
కొంతమంది ఏఐ టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అయిందంటే.. మరొకొందరు ఏఐ మనుషుల మనుగడ ప్రశ్నార్థకమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోబో మూవీలో మాదిరిగా మనుషల మాట వినకుంటే ఎలాంటి అనార్థాలు జరుగుతాయోనని భయాందోళన వ్యక్తమవుతోంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉందని నివ్వెరపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఏఐ ముప్పు గురించి కూడా ఆందోళన మొదలైంది.
అసలేం జరిగిందో తెలుసా? :
యూకేలో మ్యారేజ్ సందర్భంగా ఒక హోటల్ బుక్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఏఐ అసిస్టెంట్ సాయం తీసుకున్నాడు. ఆ ఏఐ ఏజెంట్ లియోనార్డో హోటల్‌కు ఫోన్ చేసింది. అప్పుడు అక్కడి హోటల్ ఏఐ అసిస్టెంట్ వెంటనే ఆ కాల్ రిసీవ్ చేసుకుంది. వెంటనే హాయ్ అంటూ బదులిచ్చింది. అలా రెండు ముందుగా ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలుపెట్టాయి. కాసేపటికి రెండు ఏఐ బాట్స్ అని అర్థం చేసుకుని చక్కగా మిషన్ లాంగ్వేజీలో మాట్లాడేసుకున్నాయి.