8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు బిగ్ షాక్? జీతాలు పెరగడం లేదా ఏంటి? 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో..!
8th Pay Commission : 8వ వేతన సంఘంలో జీతం పెరుగుతుంది కానీ అలవెన్సులు తగ్గుతాయా? 7వ వేతన సంఘంలో జీతం పెరుగుదలతో పాటు 101 అలవెన్సులు రద్దు అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

8th Pay Commission Big Update
8th Pay Commission Date : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు బిగ్ అలర్ట్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇటీవలే 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతం, పెన్షన్ ఎంత పెరుగుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకాన్ని ఎంత నిర్ణయిస్తారు అనేదానిపైనే పెద్ద చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం, పెన్షన్ ఫిట్‌మెంట్ కారకం ఆధారంగా నిర్ణయించే అవకాశం ఉంది.
8వ వేతన సంఘం అధికారికంగా ఏర్పాటు దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి. ఏ పాత అలవెన్సులను తొలగించాలో, ఏ కొత్త అలవెన్సులను జోడించాలో ఈ కమిషన్ నిర్ణయిస్తుంది. 7వ వేతన సంఘంలో 101 అలవెన్సులను తొలగించారు.
ఈసారి కూడా ఇలాగే జరుగుతుందా? వేతన సంఘం కింద, ఉద్యోగుల జీతాలు పెంచడమే కాకుండా, వివిధ భత్యాలు కూడా సమీక్షించబడతాయి. ఏ పాత అలవెన్సులను తొలగించాలో, ఏ కొత్త అలవెన్సులను జోడించాలో ఈ కమిషన్ నిర్ణయిస్తుంది.
7వ వేతన సంఘం నిర్ణయాలు, జీతాల పెంపు :
7వ వేతన సంఘం (7వ సీపీసీ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 2.57 ఫిట్‌మెంట్ కారకం ద్వారా పెంచాలని సిఫార్సు చేసింది. కనీస వేతనం రూ. 18వేలు, గరిష్ట వేతనం రూ. 2,25,000కు పెరిగింది. ఈ కమిషన్ మొత్తం 196 అలవెన్సులను సమీక్షించింది.
అందులో 95 అలవెన్సులను మాత్రమే ఆమోదించారు. కాగా, 101 అలవెన్సులు రద్దు అవుతాయా? లేదా ఇతర అలవెన్సులతో విలీనం అయ్యే అవకాశం ఉంది. 7వ వేతన సంఘంలో కొన్ని ప్రధాన అలవెన్సులు తొలగించింది. ఈసారి కూడా అలానే ఉండవచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి.
ఉద్యోగులు, పెన్షర్లు ఏం ఆశించవచ్చు? :
8వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 2025 నాటికి ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రభుత్వం వేతన సంఘం సభ్యులు, ఛైర్మన్‌ను ఎంపిక చేస్తుంది. వివిధ పార్టనర్లతో సంప్రదించిన తర్వాత కొత్త వేతన సంఘం నివేదికను రెడీ చేయనుంది.
అయితే, ఈ రిపోర్టుకు దాదాపు ఒక ఏడాది సమయం పట్టవచ్చు. వాటాదారులలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులు కూడా ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3.00 ఫిట్‌మెంట్ కారకం ఆధారంగా పెరగవచ్చని అంచనా. అదేగానీ జరిగితే కనీస వేతనం రూ. 26వేలకి చేరుకోవచ్చు. అయితే, తుది నిర్ణయం కమిషన్ సిఫార్సులు, ప్రభుత్వ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.
నేటి యుగంలో, ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిట్‌మెంట్ కారకాన్ని 2.57 కన్నా తక్కువగా ఉంచకూడదు. 8వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ కారకాన్ని సిఫార్సు చేస్తే.. కనీస వేతనం రూ.18వేల నుంచి రూ.46,260కి పెరగవచ్చు.
కనీస పెన్షన్ రూ.9వేల నుంచి రూ.23,130కి పెరగవచ్చు. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకాన్ని 2.86 వద్ద ఉంచితే భారీగా జీతాలు పెరగవచ్చు. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే.. కనీస వేతనం రూ.18వేల నుంచి రూ.51,480కి పెరుగుతుంది. కనీస పెన్షన్ రూ. 9వేల నుంచి రూ. 36వేలకు పెరుగుతుంది.
కొత్త అలవెన్సులు : ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త అలవెన్సులను చేర్చవచ్చు.
పాత అలవెన్సులు రద్దు అవ్వొచ్చు : 7వ వేతన సంఘం మాదిరిగా పాత అలవెన్సులు తొలగించే ఛాన్స్
డియర్నెస్ అలవెన్స్ (DA) : డియర్నెస్ అలవెన్స్ రేటు పెరగవచ్చు.
పెన్షనర్లకు రిలీఫ్ : పెన్షనర్లకు కూడా కొత్త రూల్స్ రావచ్చు. తద్వారా పెన్షన్ పెరగొచ్చు.
8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 8వ వేతన సంఘం జీతాల పెంపు సిఫార్సులు అమలు అయితే, ఉద్యోగులకు భారీ ఉపశమనం కలుగనుంది. ఇప్పుడు అందరి కళ్ళు కేంద్రం ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేతన సంఘం సిఫార్సులు ఎప్పుడు అమలు కానున్నాయో వేచి చూడాల్సిందే..