Vivo T1 Pro 5G : వివో నుంచి రెండు కొత్త T1 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Vivo T1 Pro 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్త T1 సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో Vivo T1 Pro 5G, Vivo T1 44W రెండు వేరియంట్లను లాంచ్ చేసింది.

Vivo T1 Pro 5G : వివో నుంచి రెండు కొత్త T1 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Vivo T1 Pro 5g, Vivo T1 44w Launched In India, Price Starts At Rs 14,499 (1)

Updated On : May 4, 2022 / 5:31 PM IST

Vivo T1 Pro 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్త T1 సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో Vivo T1 Pro 5G, Vivo T1 44W రెండు వేరియంట్లను లాంచ్ చేసింది. Vivo T1 Pro 5G AMOLED డిస్ప్లేతో పాటు Qualcomm Snapdragon 778G, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 66W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీ అందించింది. మరోవైపు, Vivo T1 44W మోడల్ 5000mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్‌గా పేరొందిన వివో ఇండియా డైరెక్టర్ పంకజ్ గాంధీ మాట్లాడుతూ.. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి పోటీకి తగినట్టుగా సరసమైన ధరకే మెరుగైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. భారత మార్కెట్లో సరికొత్త T1 Pro 5G, T1 44W రెండు స్మార్ట్ ఫోన్ల లాంచ్‌తో సిరీస్ T పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నట్టు పంకజ్ చెప్పారు.

Vivo T1 Pro 5G, Vivo T1 44W ధర ఎంతంటే? :
Vivo T1 Pro 5G (6GB+128GB) వేరియంట్‌ ధర రూ.23,999కి అందుబాటులో ఉంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించింది. Vivo T1 44W స్మార్ట్ ఫోన్ (4GB + 128GB) రూ. 14,499 వద్ద అందుబాటులో ఉంది. 6GB+128 GB వేరియంట్ కోసం రూ. 15,999 ధరకు అందించగా.. 8GB వేరియంట్ ధర రూ.17,999కు అందుబాటులో ఉంది.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. Vivo T1 Pro 5G కొనుగోలుపై రూ. 2500 డిస్కౌంటును అందిస్తోంది. ICICI/SBI/IDFC ఫస్ట్ బ్యాంక్/వన్ కార్డ్ కార్డ్‌లతో పేమెంట్ చేస్తే.. T144Wపై రూ.1500 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్.. మే 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Vivo T1 Pro 5G టర్బో బ్లాక్ టర్బో సియాన్ కలర్ వేరియంట్‌లలో అందిస్తోంది. Vivo T1 మిడ్‌నైట్ గెలాక్సీ, స్టార్రీ స్కై, ఐస్ డాన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Vivo T1 Pro 5g, Vivo T1 44w Launched In India, Price Starts At Rs 14,499

Vivo T1 Pro 5g, Vivo T1 44w Launched In India, Price Starts At Rs 14,499

Vivo T1 Pro 5G, Vivo T1 44W ఫీచర్లు :
Vivo T1Pro 6.44-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 6 మిలియన్ : 1 కాంట్రాస్ట్ రేషియోతో వచ్చింది. 1300 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌తో DCI-P3 కలర్ సపోర్టు అందిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో పాటు 180Hz టచ్ రేటును కలిగి ఉంది. మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలివేట్ చేసే హై-రెస్ ఆడియో సూపర్-రిజల్యూషన్ అల్గారిథమ్‌ను అందిస్తుంది. Vivo T1 కూడా 6.44-అంగుళాల AMOLED డిస్‌ప్లే, FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. vivo T1 Pro 5G T1 44W రెండూ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతున్నాయి. దీనికి FuntouchOS కూడా అమర్చారు. Vivo T1 Pro 5G, Vivo T1 వేరియంట్‌ను 4GB వరకు పొడిగించుకోవచ్చు. RAM 2.0 వరకు అందిస్తుంది.

Vivo T1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్‌తో పాటు 8GB వరకు RAMతో వస్తుంది. Vivo T1 స్నాప్‌డ్రాగన్ 680తో పాటు 8GB వరకు RAM అందించారు. కెమెరా విభాగంలో Vivo T1 Pro 5G 64-MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8-MP అల్ట్రా-వైడ్, 2-MP మాక్రోతో వచ్చింది. ఫ్రంట్ సైడ్.. సెల్ఫీల కోసం 16-MP కెమెరా ఉంది. Vivo T1 44W 50 MP ప్రైమరీ, 2MP మాక్రో కెమెరా, హైడెఫినిషన్ ఫోటోగ్రఫీ కోసం 2MP బోకె కెమెరాతో వస్తుంది. Vivo T1 Pro 5G 66W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో వస్తుంది. మరోవైపు Vivo T1 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Vivo T1 5G : వివో నుంచి ఫస్ట్ T సిరీస్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?