Vivo X200 FE : వారెవ్వా వివో ఫోన్.. భలే ఉందిగా.. పవర్‌ఫుల్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Vivo X200 FE : వివో X200 FE త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో నుంచి ఈ కాంపాక్ట్ ఫోన్ పవర్‌ఫుల్ 6500mAh బ్యాటరీతో సహా అనేక ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో రానుంది.

Vivo X200 FE
Vivo X200 FE Launch : వివో X200 FE త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో నుంచి ఈ కాంపాక్ట్ ఫోన్ పవర్‌ఫుల్ 6500mAh బ్యాటరీతో సహా అనేక ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో రానుంది.
Vivo X200 FE : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో త్వరలో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
వివో X200 సిరీస్ కింద ఈ వివో రిలీజ్ కానుంది. ఈ రాబోయే ఫోన్ వివో X200ప్రో మినీ లేదా వివో X200 FEగా ఆవిష్కరించవచ్చు. IP68, IP69 రేటింగ్‌లతో రావచ్చు.
వినియోగదారులు వివో ఫోన్‌ను X200 ప్రో మినీగా ప్రవేశపెట్టేందుకు కూడా ప్లాన్ చేస్తోంది. కానీ ఇటీవలి నివేదికలను పరిశీలిస్తే.. ఇప్పుడు వివో X200 FEగా లాంచ్ అవుతుందని సూచిస్తున్నాయి. ఈ వివో ఫోన్ రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చని అంచనా.
వివో X200 FE స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో X200 FE స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమన్షిటీ 9300 ప్లస్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మీడియాటెక్ డైమన్షిటీ 9400e ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుందని గతంలో పుకార్లు వచ్చాయి. దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
వినియోగదారులు 12GB ర్యామ్ + 256GB, 16GB ర్యామ్ + 512GB అనే రెండు స్టోరేజీ ఆప్షన్లతో ఉండొచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా FuntouchOSలో రన్ అవుతుందని అంచనా. 6,500mAh బ్యాటరీతో సపోర్టు ఉన్న 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
వివో నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ కాంపాక్ట్ 6.31-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. మల్టీ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండవచ్చు. కెమెరా ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ ఉండొచ్చు. ఇందులో 50MP మెయిన్ సోనీ IMX921 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు.
వివో ఇటీవలే భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో T4 సిరీస్‌కి సరికొత్తగా వివో T4ని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. 90W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఆప్షన్లు కలిగి ఉంటుంది.