Vivo V30 Pro Series Launch : ఈ వారమే వివో వి30 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్..!

Vivo V30 Pro Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో వి30 సిరీస్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే మిడ్-రేంజ్ వివో ఫోన్‌ల ధర వివరాలు లాంచ్ ఈవెంట్‌కు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo V30 Pro Series Launch : ఈ వారమే వివో వి30 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్..!

Vivo V30 And Pro launching in India this week

Vivo V30 Pro Series Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే మరో రెండు రోజులు ఆగండి.. భారత మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి వి30, వివో వి30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 7న లాంచ్ కానున్నాయి. రాబోయే మిడ్-రేంజ్ వివో ఫోన్‌ల ధర వివరాలు ఈవెంట్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ముకుల్ శర్మ వివో వి30 సిరీస్ ధరల గురించి వెల్లడించారు. వివో వి30 బేస్ వేరియంట్‌ దాదాపు రూ. 40వేలు ధర ఉంటుందని తెలిపారు. వివో వి30 ప్రో మోడల్ ధర సుమారు రూ. 45వేలుగా ఉండవచ్చు. అధికారిక ధరలు కావని గమనించాలి.

Read Also : Infinix Smart 8 Plus Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

లీక్ అయిన ధరలు నిజమైతే.. వన్‌ప్లస్ 12ఆర్, ఐక్యూ నియో 9 ప్రో వంటి ప్రముఖ 5జీ ఫోన్‌లతో పోటీ పడనున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లలో ఇండియా వేరియంట్ స్పెసిఫికేషన్‌లు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఫీచర్లు ఇండోనేషియా మోడల్‌ల మాదిరిగానే ఉండవచ్చు. రెండు డివైజ్‌ల్లో 6.78-అంగుళాల కర్వడ్1.5కె అమోల్డ్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 300హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,800 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తాయి.

ప్రామాణిక మోడల్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెనరేషన్ 3 చిప్‌సెట్ ఉంటుంది. అయితే, ప్రో వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీని ఎంచుకుంటుంది. వివో వి30 ఇండోనేషియన్ వేరియంట్ 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను అందిస్తుంది. అయితే, వి30 ప్రో మోడల్ 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారంగా ఫన్‌టచ్ఓఎస్ 14పై రన్ అవుతున్నాయి. చివరగా, 80డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది.

ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. :
వివో వి30 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఓఐఎస్ సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో మరో 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరోవైపు, వివో వి30 ప్రో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌కు 50ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్‌ను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల విషయానికి వస్తే.. రెండు ఫోన్‌లు 50ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి.

Read Also : Anant Ambani Luxury Watch : మొబైల్స్ వచ్చినా వాచ్‌లకు తగ్గని క్రేజ్.. అనంత్ మాత్రమే కాదు.. గాంధీ టు టామ్ క్రూయిస్ వరకు.. ప్రతి గడియారానికో చరిత్ర ఉంది!