Vivo X Fold 5 Price : కొత్త వివో ఫోల్డబుల్ ఫోన్ వస్తోందోచ్.. లాంచ్‌కు ముందే ధర లీక్.. కీలక ఫీచర్లు వివరాలివే..!

Vivo X Fold 5 Price : వివో ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది. ఈ నెల 14న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.. కీలక ఫీచర్లు, ధర వివరాలివే..

Vivo X Fold 5 Price : కొత్త వివో ఫోల్డబుల్ ఫోన్ వస్తోందోచ్.. లాంచ్‌కు ముందే ధర లీక్.. కీలక ఫీచర్లు వివరాలివే..!

Vivo X Fold 5 India price

Updated On : July 7, 2025 / 6:21 PM IST

Vivo X Fold 5 Price : కొత్త వివో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే వారమే రిటైల్ స్టోర్లలో అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ఫస్ట్ లుక్, కీలక ఫీచర్లను రివీల్ చేసింది. రాబోయే ఈ వివో మడతబెట్టే ఫోన్ 217 గ్రాముల బరువుతో తేలికైన ఫారమ్ ఫ్యాక్టర్, మడతపెట్టినప్పుడు 0.92 సెం.మీతో స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉంటుంది.

అదేవిధంగా, భారీ బ్యాటరీ, ZEISS-బ్యాక్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్, లేటెస్ట్ ఏఐ టూల్స్ కూడా కలిగి ఉంటుంది. లాంచ్‌కు ముందు వివో X ఫోల్డ్ 5 భారత్ ధర ఆన్‌లైన్‌లో కనిపించింది. వివో X ఫోల్డ్ 5 స్పెషిఫికేషన్లు, ధర వివరాలను లీక్ అయ్యాయి.

భారత్‌లో వివో X ఫోల్డ్ 5 ధర (అంచనా) :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. వివో X ఫోల్డ్ 5 ధర దాదాపు రూ.1,49,999కు పొందవచ్చు. ఈ వివో ఫోన్ సింగిల్ వేరియంట్‌లో లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. లాంచ్ తర్వాత ఈ ఫోల్డబుల్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఈ-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Google Pixel 9 Pro XL : పిక్సెల్ యూజర్లకు పండగే.. భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 9ప్రో XL ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే?

వివో X ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో X ఫోల్డ్ 5 ఫోన్ 8.03-అంగుళాల ఫోల్డబుల్ LTPO అమోల్డ్ ప్రైమరీ స్క్రీన్, 6.53-అంగుళాల కవర్ స్క్రీన్‌తో లాంచ్ కానుంది. రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. హుడ్ కింద ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ లేదా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో​వస్తుంది.

16GB ర్యామ్, 512GB ర్యామ్ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ 6,000mAh బ్యాటరీతో రానుంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగి ఉంది. IPX 8, IPX9 వాటర్ రెసిస్టెన్స్, IP5X డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్, 50MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ ఉన్నాయి. ఇందులో మల్టీ పోర్ట్రెయిట్ ఫోకల్ లెంగ్త్‌లతో జీస్ ఆప్టిక్స్ ఫీచర్లు ఉన్నాయి.