Vivo X100 Series Launch : వివో X100 సిరీస్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Vivo X100 Series Launch : వివో నుంచి సరికొత్త X100 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు సంబంధించి కెమెరా ఫీచర్లు ముందే లీకయ్యాయి.

Vivo X100 Series Launch : వివో X100 సిరీస్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Vivo X100, Vivo X100 Pro Camera Specifications

Vivo X100 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్ వస్తోంది. అదే.. వివో X100 సిరీస్ ఫోన్.. మొత్తం రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. షెడ్యూల్ ప్రకారం.. చైనాలో వివో X100, వివో X100 ప్రోలను లాంచ్ చేయాల్సి ఉండగా.. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లలోని కెమెరాల కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. వివో కంపెనీ చైనాలో జరిగే ఈవెంట్‌లో వివో X100 సిరీస్‌లో రెండు మోడళ్లను ప్రకటించాలని భావిస్తోంది. అయితే మూడో వివో X100 ప్లస్ కూడా లాంచ్ కానుందా? లేదా అనేది అస్పష్టంగా ఉంది.

Read Also : Vivo X100 Series Launch : వివో X100 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కెమెరా ఫీచర్లు లీక్.. పూర్తి వివరాలు మీకోసం..!

వివో ప్రో కెమెరా డిజైన్ ఇదేనా? :
ఇటీవలే వివో X100, వివో X100 ప్రో మోడల్‌ లీక్ ప్రకారం.. కెమెరా డిజైన్, కెమెరా హార్డ్‌వేర్‌లలో తేడాలను సూచిస్తుంది. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం.. రాబోయే రెండు స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా మాడ్యూల్స్ డిజైన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. వివో X100, వివో X100 ప్రో కెమెరా లేఅవుట్ మధ్య చిన్న తేడా ఉండనుంది. పర్ఫెక్ట్ సర్కిల్‌ని కలిగిన ఫోన్‌లతో పోలిస్తే.. ఫోన్‌లలో రెక్టాంగ్యులర్ కెమెరా ఆకర్షణీయంగా ఉండనుంది. వివో X100 ప్రో లేఅవుట్ వివో X100లోని యూనిట్ కన్నా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. వివో X100 ప్రోలో వాల్యూమ్, పవర్ బటన్‌లు కూడా కొంచెం పైకి ఉండనున్నాయి.

మరిన్ని కెమెరా ఫీచర్లు ఇవే? :
వివో X100 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎఫ్/1.75 ఎపర్చర్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉందని టిప్‌స్టర్ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఎఫ్/2.0 ఎపర్చరుతో కూడిన 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, ఓఐఎస్, ఎఫ్/2,5 ఎపర్చర్‌తో కూడిన పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. టెలిఫోటో కెమెరా 4.3ఎక్స్ జూమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Vivo X100, Vivo X100 Pro Camera Specifications

Vivo X100, Vivo X100 Pro Camera Specifications

వివో X100 కెమెరా సెటప్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. టిప్‌స్టర్ ప్రకారం.. ప్రైమరీ కెమెరా ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ సెన్సార్ ఎఫ్/1.6 ఎపర్చరుతో ఉంటుంది. అల్ట్రా-వైడ్ కెమెరా ఖరీదైన మోడల్‌లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. టెలిఫోటో కెమెరా ఎఫ్/2.6 ఎపర్చరు, ఓఐఎస్‌తో 64ఎంపీ సెన్సార్‌గా ఉంటుంది. కానీ, రీచ్ పరంగా 3ఎక్స్ జూమ్ వరకే పరిమితమైందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

గత లీక్‌ల ప్రకారం పరిశీలిస్తే.. వివో X100 మోడల్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 9300 SoC ద్వారా రానుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా చైనాలో (OriginOS 4)తో రానుందని భావిస్తున్నారు. వివో X100 ప్రో కోర్ హార్డ్‌వేర్ పరంగా వివో X100 మాదిరిగానే స్పెసిఫికేషన్‌లలో అదే ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో X100 ప్రో ప్లస్ సరికొత్త క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoCని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Volvo EM90 Electric : 738కి.మీ రేంజ్‌తో కొత్త వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ లగ్జరీ మినీవ్యాన్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!