Vivo Y19s Price : వివో Y19s ఫోన్ ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

Vivo Y19s Price : వివో వై19ఎస్ ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది.

Vivo Y19s Price : వివో Y19s ఫోన్ ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

Vivo Y19s price revealed, comes with 5,500mAh battery

Updated On : November 8, 2024 / 12:26 AM IST

Vivo Y19s Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. వివో Y19ఎస్ మోడల్ గత నెలలో చైనాలో ఆవిష్కరించింది. అయితే, ఈ ఫోన్ ధర, లభ్యతను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, కంపెనీ ఇప్పుడు ఫోన్ ర్యామ్, స్టోరేజ్, ధరను వెల్లడించింది. వివో వై19ఎస్ 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్‌లలో వస్తుందని అంచనా. 128జీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంటుందని వివో ధృవీకరించింది. ధర విషయానికొస్తే.. భారతీయ కరెన్సీలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.9,800 నుంచి ప్రారంభమవుతుంది.

వివో వై19ఎస్ ర్యామ్, స్టోరేజీ ధర ఎంతంటే? :
వివో వై19ఎస్ ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. థాయిలాండ్‌లో టీహెచ్‌బీ 3,999, (దాదాపు రూ.9,800), 4జీబీ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. 128జీబీ స్టోరేజీతో వస్తుంది. ఈ వివో ఫోన్ ధర దాదాపు రూ. 11,000కు పొందవచ్చు. అత్యధిక వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. థాయిలాండ్‌లో టీహెచ్‌బీ 4,999 వద్ద లాంచ్ అయింది. భారత కరెన్సీలో దాదాపు రూ. 12,200 వద్ద లభిస్తుంది.

వివో వై19ఎస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు :
వివో వై19ఎస్ 720×1,608 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.68-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 264పీపీఐ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. 6జీబీ వరకు ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 ఇంటర్నల్ స్టోరేజీతో కలిపి 12ఎన్ఎమ్ ఆక్టా-కోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో వై19ఎస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50ఎంపీ మెయిన్ సెన్సార్, ఎఫ్/3.0 ఎపర్చర్‌తో 0.08ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీతో ఆధారితమైనది. 15డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి.

వివో ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది. 5-స్టార్ ఎస్‌జీఎస్ డ్రాప్ రెసిస్టెన్స్, ఎంఐఎల్-ఎస్టీడీ 810హెచ్ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. వివో వై19ఎస్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. వివో వై19ఎస్ కొలతలు 165.75x 76.10 x 8.10ఎమ్ఎమ్, బరువు 198 గ్రాములు ఉంటుంది. ఈ ఫోన్ మొత్తం గ్లేసియర్ బ్లూ, గ్లోసీ బ్లాక్, పెర్ల్ సిల్వర్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Redmi A4 Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 10వేల లోపు ధరలో రెడ్‌మి A4 ఫోన్ వచ్చేస్తోంది..!