Vodafone idea 5G : Vi కస్టమర్లకు పండగే.. ఈ నెల 15 నుంచే 5G సర్వీసులు.. రీఛార్జ్ ప్లాన్ల ధర ఎంతంటే?
Vodafone idea 5G : వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు విస్తరిస్తోంది. ఈ 5జీ రీఛార్జ్ ప్లాన్ల ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయంటే?

Vodafone idea 5G
Vodafone idea 5G : వోడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా 5G విస్తరణలో భాగంగా మే 15న ఢిల్లీ NCRలో హై-స్పీడ్ 5G సర్వీసులను ప్రారంభించనుంది.
ఢిల్లీలోని వోడాఫోన్ ఐడియా యూజర్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు, Vi 5G పాట్నా, చండీగఢ్, ముంబై నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆగస్టు చివరి నాటికి, కంపెనీ 17 మెయిన్ సర్కిల్‌లలో 5G స్పెక్ట్రమ్‌ను అందించాలని టెలికం దిగ్గజం భావిస్తోంది.
ఢిల్లీ NCRలో నెట్‌వర్క్‌ను ఎరిక్సన్‌తో భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు టెలికాం ఆపరేటర్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇందులో మౌలిక సదుపాయాలు, మెరుగైన పనితీరు కోసం ఏఐ ఆధారిత సెల్ఫ్-ఆర్గనైజింగ్ నెట్‌వర్క్ ఉన్నాయి.
ఆసక్తికరంగా పరిశీలిస్తే.. ఎయిర్‌టెల్ మాదిరిగానే వోడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్ 5G నాన్-స్టాండ్అలోన్ (NSA) ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుంది. వినియోగదారులకు 4G, 5G మధ్య మరింత అప్‌గ్రేడ్ తీసుకురానుంది.
ఢిల్లీలో Vi 5G రీఛార్జ్ ప్లాన్‌లు :
5G ఎనేబుల్డ్ డివైజ్‌ల్లో సబ్‌స్క్రైబర్‌లకు అన్‌లిమిటెడ్ డేటాతో, Vi 5G రీఛార్జ్ ప్లాన్‌లు రూ.299 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.
కంపెనీ డౌన్‌లోడ్ స్పీడ్, మెరుగైన స్ట్రీమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్‌తో పాటు మెరుగైన క్లౌడ్ యాక్సెస్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3 ఏళ్ల పాటు విస్తరించిన వోడాఫోన్ ఐడియా రూ. 55వేల కోట్ల మూలధన వ్యయ ప్రణాళికలో భాగంగా 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఆ తర్వాత దేశీయ నగరాల్లో బెంగళూరు, మైసూరు నగరాల్లో 5 సర్వీసులను ప్రారంభించనుంది. కంపెనీ ప్రకారం.. వోడాఫోన్ ఐడియా అర్హత కలిగిన వినియోగదారులలో 70శాతం మంది ఇప్పటికే ముంబైలో 5G ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం డేటా ట్రాఫిక్‌లో 20శాతం ముంబై నుంచే నమోదైంది.