ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాగానే కొనేద్దామని ఎదురు చూస్తున్నారా? మీకో బ్యాడ్‌న్యూస్
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.

Samsung Galaxy S25 Edge
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ లాంచ్ కాగానే కొనేద్దామని రెడీగా ఉన్న వారికి చేదువార్త. మీరు ఇంకొన్ని వారాలు వేచి చూడాల్సిందే. గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఏప్రిల్ 15న లాంచ్ అవుతుందని అందరూ భావించారు.
అయితే, ఈ లాంచ్ తేదీ వాయిదా పడిందని టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ మే లేదా జూన్‌లో మార్కెట్లోకి వస్తుందని చెప్పారు. దీనిపై శాంసంగ్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ 6.7-అంగుళాల OLED డిస్ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేటు, 2,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఇది విడుదల కానుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను ఇందులో వాడారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో పాటు 200 ఎంపీ మెయిన్ కెమెరాతో ఉంటుంది. గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌ను స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో యూజర్ల ముందుకు తీసుకొస్తున్నారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 3,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఇది వస్తుంది.
శాంసంగ్ తన గెలాక్సీ ఏఐ ఫీచర్లను కూడా S25 ఎడ్జ్‌లో వాడుతోంది. ఏఐ ఆధారిత టూల్స్ యూజర్లకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న గెలాక్సీ ఎస్ 25 ప్లస్, ప్రీమియం ఎస్ 25 అల్ట్రా ధరల గురించి మనకు తెలుసు.
ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ సుమారు రూ.94,800 – రూ.1,03,400 మధ్య ఉంటుందని అంచనా. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. శాంసంగ్ అధికారికంగా ధరల వివరాలను ఇంకా వెల్లడించలేదు.