Want to enjoy Earth’s beauty from space_ World’s first commercial space station revealed
World Space Station : అంతరిక్షం.. అదో అద్భుతమైన ప్రపంచం.. అలాంటి ప్రపంచానికి దగ్గరగా వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు. ఎప్పుడూ భూమిపై ఉండి బోరు కొడుతుంది కదా.. కాస్తా అంతరిక్షం వరకు వెళ్లి వస్తే బాగుండు అనేవారు కొందరు. రోజు ఉదయం లేవగానే కాస్తా వేడిగా కప్పు టీ తాగుతూ అలా బయటి అందాలను చూడాలని భావిస్తుంటారు. కానీ, ఎప్పటిలా కాకుండా అంతరిక్షంలో నుంచి భూమి అందాలను ఇలా చూడటాన్ని ఓసారి ఊహించుకోండి.
ఎంత అందంగా అనిపిస్తుందో కదా.. ఇప్పుడు అలాంటి అద్భుతమైన క్షణమే రాబోతోంది. అదేగానీ పూర్తి అయితే రాబోయే రోజుల్లో హాయిగా అంతరిక్షంలో కప్పు కాఫీ తాగుతూ భూమి హోరిజోన్ పైన సూర్యుడు ఉదయించడాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు.
Read Also : Oppo K12 Plus Launch : కొత్త ఫోన్ చూశారా? ఒప్పో K12 ప్లస్ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే..!
చూస్తుంటే ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది అంటారా..? కానే కాదు.. రియల్ లైఫ్‌లో ఇది సాధ్యం కానుంది. కలను నిజం చేసుకునేలా ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ స్టేషన్ రాబోతుంది. స్టార్టప్ హెవెన్-1 ప్రాజెక్ట్ పేరుతో ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.
దీనికి సంబంధించి ఆకర్షణీయమైన ఇంటీరియర్‌లను ప్రదర్శిస్తూ ఫైనల్ డిజైన్‌ను ఆవిష్కరించే ఇటీవలి వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో చాలామందిని విస్మయానికి గురి చేసింది. ఈ అద్భుతమైన అంతరిక్ష కేంద్రం హెవెన్-1 ఫైనల్ డిజైన్‌ను రివీల్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కంపెనీ వాస్ట్ పోస్టులో పేర్కొంది.
సోషల్ మీడియా రెస్పాన్స్ ఎలా ఉందంటే? :
నెటిజన్ల స్పందనలు భిన్నంగా వినిపిస్తున్నాయి. డిజైన్ పూర్తిగా కార్యరూపం దాల్చడంపై కొందరు ఉత్సాహంగా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటే.. మరికొందరు ఈ ప్రైవేట్ స్పేస్ స్టేషన్ గురించి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. “ఇది ఆపరేషన్‌కు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది?” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. స్పేస్ఎక్స్ డ్రాగన్ వాహనంలో ఆగస్ట్ 2025 కన్నా ముందుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది. ఇది అద్భుతంగా ఉంటుందని.. ఒక ఫుల్ గేమ్ ఛేంజర్ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.
అంతరిక్ష కేంద్రం డిజైన్ ఎలా ఉండనుంది? :
డిజైన్ ప్రకారం.. “అబ్జర్వేషన్ డెక్” కలిగి ఉంటుంది. భూ ఉపరితల వాతావరణం అందాలను వీక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది. వాస్తవానికి ఇందులో అద్భుతమైన ఫీచర్ ఒకటి ఉంది. పేటెంట్-పెండింగ్ స్లీప్ సిస్టమ్.. జీరో గురుత్వాకర్షణలో ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. “ఆన్‌బోర్డ్ ఫిట్‌నెస్ సిస్టమ్” కూడా ఉంటుంది. సహజమైన పదార్థాలతో వెచ్చగా ఉండే ఇంటీరియర్స్ వంటి ప్లాన్ డాక్యుమెంట్‌లను కలిగి ఉంటుంది.
“ప్రతి ఒక్కరూ భూమిపై కాకుండా అంతరిక్షంలో కూడా నివసించవచ్చు. రాబోయే భవిష్యత్తును అందుకు తగినట్టుగా సృష్టించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. మనుషులు నివాసానికి తగినట్టుగా అక్కడి అంతరిక్ష కేంద్రంలోని అన్ని సౌకర్యాలతో కలిగిన డిజైన్ చేయడం ఎంతో అవసరం” అని వ్యాస్ట్ చీఫ్ డిజైన్, మార్కెటింగ్ ఆఫీసర్ హిల్లరీ కో తెలిపారు. డిజైనర్ పీటర్ రస్సెల్-క్లార్క్ అనుభవజ్ఞుడైన నాసా వ్యోమగామి ఆండ్రూ ఫ్యూస్టెల్ సపోర్టుతో డిజైనింగ్ బృందానికి మార్గనిర్దేశం చేశారు.